Viral Video: మా జాబ్స్ మా వాళ్లే తీసుకుంటున్నారన్న భారత సంతతి టెక్కీ
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:05 PM
ఇటివల కాలంలో ఐటీ కొలువుల(it jobs) కోత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కీలక సంస్థలు వేలాది మందిని తొలిగించిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉన్న ఓ భారత సంతతి టేక్కీ ఉద్యోగుల తొలగింపు గురించి ఓ వీడియో ద్వారా కీలక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఇటివల కాలంలో ఐటీ కొలువుల(it jobs) కోత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కీలక సంస్థలు వేలాది మందిని తొలిగించిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ సహా అనేక కంపెనీలు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా(america)లో ఉన్న ఓ భారత సంతతి టేక్కీ ఉద్యోగుల తొలగింపు గురించి ఓ వీడియో ద్వారా కీలక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఇటీవల అమెరికాలో తొలగించబడిన భారతీయ సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల స్థానంలో భారతదేశంలో నివసిస్తున్న భారతీయులను భర్తీ చేయబోతున్నారని పేర్కొన్నాడు.
@Alphafox78 ద్వారా Xలో పోస్ట్ చేసిన వీడియోలో భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(software engineer) తనను, అతని మొత్తం బృందాన్ని ఇటీవల తొలగించారని వెల్లడించారు. వారందరి స్థానంలో భారతీయులు వస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఆ క్రమంలో తన తల్లిదండ్రులు కూడా ఇండియాలో ఉద్యోగం చేస్తున్నారని, చిన్న వయస్సులోనే తాను అమెరికాకు వలస వెళ్లినట్లు తెలిపాడు. దీంతో తన ఉద్యోగాన్ని కొనసాగించాలని, తాను కూడా భారతీయుడని తన కంపెనీకి చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ వాస్తవం అతని ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి హెల్ప్ చేయలేదు.
ఈ క్రమంలో స్పందించిన సంస్థ 'లేదు, లేదు, మీకు అర్థం కాలేదు. మేము మిమ్మల్ని వదిలించుకుంటున్నామని తెలిపింది. భారతదేశం నుంచి భారతీయులు చేయవలసిన పనిని మేము భారతదేశానికి తరలిస్తున్నామని స్పష్టం చేసింది. అక్కడ వారు చౌకగా చేస్తారని వెల్లడించింది. ఈ క్రమంలో భారతీయులు మా ఉద్యోగాలను తీసుకుంటున్నారని నాకు అనిపించిందని వీడియోలోని ఆ వ్యక్తి వెల్లడించారు.
అయితే ఈ వీడియో చూసిన పలువురు అనేక విధాలుగా కామెంట్లు(comments) చేస్తున్నారు. ఇదంతా డబ్బుకు సంబంధించిన వ్యవహారమని ఓ వ్యక్తి అనగా, భారతదేశంలో చాలా తక్కువగా పని చేస్తారని ఇంకో వ్యక్తి పేర్కొన్నారు. ఇంకోవ్యక్తి వర్క్ వీసాలపై పనిచేస్తున్న వారు కూడా త్వరలో ఇండియా తిరిగి వెళ్లవలసి ఉంటుందని భయాందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral News: సింగిల్ బెడ్ రూం అద్దె నెలకు రూ. 70 వేలు.. ఎక్కడో తెలుసా
Viral Video: వామ్మో.. దోమలకు ఎలా రక్తం ఇస్తున్నాడో చూడండి.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు!
Viral Video: వామ్మో.. ఇదెలా జరిగింది? కారులో ఒంటె ఇలా ఇరుక్కుపోయిందేంటి? వైరల్ అవుతున్న వీడియో!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి