Home » Somesh Kumar
తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వీఆర్‌ఎస్ తీసుకున్న సోమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన కమర్షియల్ ట్యాక్స్ స్కామ్‌పై (GST Scam) సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై (Former CS Somesh Kumar) పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు.
Telangana: కమర్షియల్ ట్యాక్స్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.1400 కోట్ల స్కామ్‌పై అసెంబ్లీలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఐదు మందిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆధారాలను సేకరించారు. 75 మంది పన్నులు చెల్లింపుదారులు ..
Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కమర్షియల్ ట్యాక్స్ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. మాజీ సీఎస్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు అయ్యింది.
మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఆస్తుల చిట్టాలో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన యాచారంలో భూములు కొన్నట్టు తేలింది. ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని, 25 ఎకరాల భూములను అత్యంత తక్కువ రేటుకు తన భార్య డాగ్యన్ముద్ర పేరిట కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.