Share News

TG News: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..

ABN , Publish Date - Dec 19 , 2024 | 12:37 PM

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రెండోరోజు గురువారం కొనసాగుతోంది. దీనిలోభాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్‌కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో స్మితా సబర్వాల్‌ను కమిషన్ విచారిస్తోంది.

TG News: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..
Kaleshwaram Commission public inquiry

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ (Kaleshwaram Commission public inquiry) రెండోరోజు (Second Day) గురువారం కొనసాగుతోంది. దీనిలోభాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్‌కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో స్మితా సబర్వాల్‌ను కమిషన్ విచారిస్తోంది. అనంతరం కమిషన్ ముందు రిటైర్డ్ ఐఏఎస్ సోమేష్ కుమార్ హాజరుకానున్నారు.

కాగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నది మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులేనని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శైలేంద్రకుమార్‌ జోషి నిన్న (బుధవారం) తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌కు గత ప్రభుత్వం నిర్ణయించిందని.. దాంట్లో భాగంగానే మేడిగడ్డపైనా నిర్ణయం తీసుకుందని కమిషన్‌కు వివరించారు. విచారణ సందర్బంగా జోషికి కమిషన్ ప్రశ్నలు వేసింది.


మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టడానికి కారణం ఏంటని కమిషన్ ప్రశ్నించగా తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్‌ చేశారని, అప్పటికి బ్యారేజీ తప్ప ఇతర కాంపోనెంట్ల పరంగా 7.7 శాతం పనులు జరిగాయని శైలేంద్రకుమార్‌ జోషి అన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రంతో మేడిగడ్డ నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కేంద్ర జలవనరుల సంఘం కూడా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, ఆఫ్‌లైన్‌, అన్‌లైన్‌ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం పెరగాలని చెప్పిందని ఆయన సమాధానం ఇచ్చారు.

బ్యారేజీలు అక్కడే కట్టాలనే నిర్ణయాలు ఎవరివి అనే ప్రశ్నకు అప్పటి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో వ్యాప్కోస్‌ కమిటీ, సీఈ, సీడీవో, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారనిశైలేంద్రకుమార్‌ జోషి వెల్లడించారు, సబ్‌కమిటీ వేయలేదని, 2016 మే 2న మేడిగడ్డ బ్యారేజీ వద్ద కేసీఆర్‌ భూమి పూజ చేసి, మూడు బ్యారేజీల నిర్మాణం ప్రారంభించారని, అదే రోజు ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చారని తెలిపారు.


బ్యారేజీల నిర్మాణంపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా.. ప్రభుత్వం అంటే ఏమిటని కమిషన్ ప్రశ్నించింది. అప్పటి మంత్రివర్గం, సీఎం కేసీఆర్‌ విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని, సింగిల్‌ జడ్జి కన్నా బెంచ్‌ బలమైనదన్నట్లుగా.. సీఎం కన్నా మంత్రివర్గమే బలమైనదని.. అయితే సీఎంను ఎవరైనా మంత్రి వ్యతిరేకించినా, అసమ్మతి తెలిపినా ఆ మరుసటి రోజే మంత్రివర్గం నుంచి ఉద్వాసన ఉంటుందని శైలేంద్రకుమార్‌ జోషి వెల్లడించారు.

స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్సీ) లక్ష్యాలు, విధులు, బాధ్యతలు ఏమిటి.. కాళేశ్వరం ప్రాజెక్టుకు పరిపాలన పరమైన అనుమతులన్నీ ఉన్నాయా.. అని కమిషన్ ప్రశ్నించగా.. వివిధ ఇంజనీరింగ్‌ శాఖలకు చెందిన ఐదుగురు చీఫ్‌ ఇంజనీర్లతో ఎస్‌ఎల్‌ఎస్‌సీ ఉంటుందని శైలేంద్రకుమార్‌ జోషి తెలిపారు. ఒక ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాల ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ కమిటీ చర్చించి, లోపాలుంటే వాటిని సవరించాలని సూచిస్తుందన్నారు. అన్నీ సరిగా ఉంటే ఆ ప్రతిపాదనలకు పరిపాలనపరమైన అనుమతి ఇవ్వవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 28 ప్యాకేజీలు, 8 లింకులుగా ఉందని వెల్లడించారు. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా ప్రాజెక్టులో మార్పులు చేశామన్నారు. చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌ఎల్‌ఎస్‌సీకి ప్రతిపాదనలు పంపిస్తే... ఆ తర్వాత ప్రభుత్వానికి చేరిన తర్వాత దాదాపు 200లకుపైగా పనులకు విడివిడిగా పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చామని జోషి వివరించారు.

మేడిగడ్డ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సంస్థ కొన్ని బ్లాకులను వేరే సంస్థతో కట్టించిందా అనే ప్రశ్నకు మాత్రం.. ఆ సమాచారం తనకు తెలియదని శైలేంద్రకుమార్‌ జోషి సమాధానం ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

కేరళలో మంకీపాక్స్ వైరస్ కలకలం

భారత్‌కు అమెరికా గుడ్ న్యూస్..

గంట ముందుగానే అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి

గాయకుడు బలగం మొగిలయ్య కన్నుమూత

రైతు కండువాలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 19 , 2024 | 12:37 PM