Home » Sonia Gandhi
కాంగ్రెస్ నేత సోనియా గాంధీ శనివారంనాడు శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రఖ్యాత నిగీన్ లేక్ లో పడవలో ప్రయాణించారు. నిగీన్ లేక్‌లోని హౌస్‌బోట్‌లో బస చేస్తున్న రాహుల్ గాంధీని ఆమె కలుసుకోనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం శ్రీనగర్‌కు రాహుల్ గాంధీ శుక్రవారం వచ్చారు.
60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో, పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా?. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో గౌరవ సోనియా గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లడఖ్ యాత్ర కొనసాగుతంది. సోమవారం ఆయన లడఖ్‌లోని కర్జుంగ్ లా పాస్‌ను సందర్శించారు. ఇది ప్రపంచంలోని ఎత్తైన మోటారు రోడ్డు మార్గాలలో ఒకటి.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress chief Mallikarjun Kharge) ఆదివారం ఆ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC)ని పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీలో స్థానం దక్కించుకున్నవారిలో రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్, కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన శశి థరూర్ కూడా ఉన్నారు.
వారసత్వ రాజకీయాలు క్విట్ ఇండియా అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నినాదాలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రథమ కుటుంబం నుంచి మరో వారసురాలు రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి.
అవును.. వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి ఢిల్లీ వేదికగా జరిగిన చర్చలు దాదాపు కొలిక్కివచ్చేశాయ్!. రెండ్రోజుల పాటు ఢిల్లీలో పార్టీ విలీనంపై వైఎస్ షర్మిల (YS Sharmila) వరుస భేటీలతో బిజిబిజీగా గడిపారు. గురు, శుక్రవారం రెండ్రోజులు హస్తినలో ఉన్న ఆమె.. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు (Hyderabad) చేరుకున్నారు..
వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి సమయం ఆసన్నమైందా..? అతి త్వరలోనే విలీన ప్రక్రియ ముగియనుందా..? ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పెద్దలతో వైఎస్ షర్మిల (YS Sharmila) భేటీ కాబోతున్నారా..? రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే (New Delhi)పెద్దలతో కీలక చర్చలు జరపబోతున్నారా..? అంటే తాజా పరిస్థితులు, జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని తెలుస్తోంది..
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్నాయ్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ (BRS) విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్‌ను గద్దె దించి.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ (Congress) వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది...
అవును.. మీరు వింటున్నది నిజమే.. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌లో (TS Congress) కీలక పరిణామం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. హమ్మయ్యా.. ఇకనైనా కలిశారు.! ఇక అధికార పార్టీకి దబిడి దిబిడేనని కార్యకర్తలు, వీరాభిమానులు (Congress Fans) చెప్పుకుంటున్నారు.! సోషల్ మీడియా వేదికగా (Social Media) అయితే ఇద్దర్నీ ఆకాశానికెత్తేస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరనేది ఫొటో చూడగానే ఇప్పటికే క్లారిటీ వచ్చేసిందిగా.! అయితే ఢిల్లీ (Delhi) వేదికగా ఈ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు..?..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉత్తర గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తూ, మార్గమధ్యంలో ఓ కెన్నెల్‌కు వెళ్లారు. అక్కడి కుక్క పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఆనందించారు. ఓ కుక్క పిల్లను తనతోపాటు ఢిల్లీకి తెచ్చుకున్నారు. మరో కుక్క పిల్లను కూడా ఆయన ఇష్టపడ్డారని, దానిని తాము ఢిల్లీకి పంపిస్తామని కెన్నెల్ యజమానురాలు చెప్పారు.