Home » Sonia Gandhi
‘మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాను’ అని రాయ్‌బరేలీ ఓటర్లను ఉద్దేశించి ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.
రాయబరేలి ప్రజలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక అభ్యర్థన చేశారు. నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్ గాంధీ ని కూడా అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం వమ్ము చేయరని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున.. నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకువచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.
రాయ్‌బరేలీ నియోజకవర్గంతో తనకు కుటుంబ బంధం ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
దేశంలోని మహిళలు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభిప్రాయ పడ్డారు. మహాలక్ష్మీ పథకంతో మహిళల జీవితాల్లో వెలుగు వచ్చిందన్నారు.
Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు.
ప్రధాని మోదీ రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని సోనియాగాంధీ ఆరోపించారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యమని విమర్శించారు. మంగళవారం ఆమె ఓ వీడియో విడుదల చేశారు.
ఈ ఎన్నికల్లో ఎలాగైన అధికారం అందుకోవాలని ప్రధాని మోదీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు.. మూడో దశ పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీతోపాటు ఆయన పార్టీపై సోనియాగాంధీ గాంధీ మండిపడ్డారు.
అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిషోరీ లాల్ శర్మ పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యంగ్య బాణాలు సంధించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆమె మాట్లాడుతూ.. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల బరిలో దిగడం.. అమేఠీ ప్రజల విజయమని ఆమె అభివర్ణించారు.
అమేథి లోక్ సభ నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. గత 31 ఏళ్ల నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలోకి దిగారు. అమేథితో గాంధీ కుటుంబానికి 1980 నుంచి అనుబంధం ఉంది.