Share News

CM Revanth Reddy: కాంగ్రె్‌సలోకి పోచారం..

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:47 AM

మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం ఇటీవల బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్‌ కండువా కప్పారు.

CM Revanth Reddy: కాంగ్రె్‌సలోకి పోచారం..

  • కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే

  • నా రాజకీయ జీవితం కాంగ్రె్‌సలోనే మొదలైంది.. ముగిసేదీ కాంగ్రె్‌సలోనే

  • రేవంత్‌ నాయకత్వాన్ని బలపరిచేందుకే కాంగ్రె్‌సలోకి: శ్రీనివాస్‌ రెడ్డి

న్యూఢిల్లీ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం ఇటీవల బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్‌ కండువా కప్పారు. సీఎం రేవంత్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. తన కుమారుడు భాస్కర్‌ రెడ్డితో కలిసి సోమవారం రాత్రి ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఖర్గేను కలిశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. మంగళవారం పార్టీ అగ్ర నేతలను కలవనున్న సీఎం రేవంత్‌.. పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని వారికి పరిచయం చేయనున్నారని తెలిసింది.


అనంతరం మీడియాతో మాట్లాడిన పోచారం.. కాంగ్రె్‌సతోనే తన రాజకీయ జీవితం మొదలైందని,చివరికి ముగిసేదీ కాంగ్రె్‌సలోనేనని అన్నారు. ఆరు నెలలుగా ప్రభుత్వ పరిపాలనను గమనిస్తున్నానని, సీఎం రేవంత్‌ అంకితభావంతో పని చేస్తున్నారని కొనియాడారు. సమర్థవంతమైన పాలనను అందిస్తున్నారని కితాబునిచ్చారు. రైతులకు మంచి జరగాలనే రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ తనతోపాటు తన అనుచరులు మొత్తం కాంగ్రె్‌సలో చేరినట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ పిలుపుతో టీడీపీలో చేరానని, పదేళ్లు కేసీఆర్‌ నాయకత్వంలో పని చేశానని చెప్పారు. తిరిగి కాంగ్రె్‌సలో చేరడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - Jun 25 , 2024 | 03:47 AM