Home » Summer Holidays 2024
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అసలే పిల్లలకు వేసవి సెలవులు.. అంతా ఇంటి దగ్గరే.. దీంతో ఎండల నుంచి ఉపశమనం కోసం ఎక్కువమంది విహరయాత్రలకు వెళ్తుంటారు. కొందరు విదేశాలకు వెళ్తుంటే.. మరికొందరు వేసవిలోనూ చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్తుంటారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ పట్ల శీతకన్ను వేసింది. ఐదేళ్ల పాలనా కాలంలో రెండేళ్లు మాత్రమే ఈ శిబిరాలు నిర్వహించింది. అందులోనూ క్రీడాకారులకు ఎటువంటి కిట్లు ఇవ్వకుండా, కోచలకు గౌరవ వేతనం చెల్లించకుండా మమా అనిపించేసింది. ఈ ఏడాదిలో మే 1 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తామని కోచల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తరువాత సార్వత్రిక ఎన్నికలు అంటూ మే 15కి వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది రెగ్యులర్గా శాప్ కోచలు నిర్వహించే శిక్షణ కేంద్రాలనే సమ్మర్...
వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వేడి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విద్యార్థులు బయట తిరిగితే ప్రమాదమని భావించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి.
ఉగాది పండుగ (Ugadi festival) వేళ మెట్రో ట్రైన్ (Metro Train) ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం బంపరాఫర్ ప్రకటించింది. మెట్రోలో ప్రయాణికులకు అందిస్తున్న వివిధ రాయితీలు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈ రాయితీలను పొడిగిస్తున్నట్లు మెట్రో యజమాన్యం ప్రకటించింది.
ఏపీలో విద్యార్థులకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. రెండు రోజుల క్రితం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. నేడు కళాశాలలకు సైతం సెలవులు ప్రకటించింది. కాలేజీ విద్యార్థులకు మే 31 వరకూ వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున: ప్రారంభం కానున్నాయి.
ఏపీలో ఎండలు మండుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించేసింది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 13 వరకూ అంటే 50 రోజుల పాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.