Holidays: ఏపీలో కాలేజీ విద్యార్థులకు వేసవి సెలవులు.. యాజమాన్యాలకు హెచ్చరిక..
ABN , Publish Date - Apr 04 , 2024 | 07:59 AM
ఏపీలో విద్యార్థులకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. రెండు రోజుల క్రితం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. నేడు కళాశాలలకు సైతం సెలవులు ప్రకటించింది. కాలేజీ విద్యార్థులకు మే 31 వరకూ వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున: ప్రారంభం కానున్నాయి.
అమరావతి: ఏపీలో విద్యార్థులకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. రెండు రోజుల క్రితం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం (AP Government).. నేడు కళాశాలలకు సైతం సెలవులు ప్రకటించింది. కాలేజీ విద్యార్థులకు మే 31 వరకూ వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున: ప్రారంభం కానున్నాయి. కాగా.. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఎలాంటి క్లాసులూ నిర్వహించవద్దని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే షెడ్యూల్ విడుదలకు ముందే ప్రవేశాలు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని సైతం హెచ్చరించింది.
Road Accident: పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఏపీ ప్రభుత్వం (AP Government) స్కూళ్లకు సైతం రెండు రోజుల క్రితమే వేసవి సెలవులు ప్రకటించేసింది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 13 వరకూ అంటే 50 రోజుల పాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. మార్చి 18 నుంచి ఏపీ ప్రభుత్వం ఎండల కారణంగా ఒంటిపూట బడులను ప్రకటించింది. అప్పటి నుంచి ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
AP Elections:ఆముదాలవలసలో ఆధిపత్యం ఎవరిది..?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.