Home » Summer
బుధవారం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా విజయవాడలో 66.5 మిల్లీమీటర్లు, ఎ.కొండూరులో 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉత్తరాది ప్రజలు మూడు రోజుల నుంచి విపరీతమైన వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి భగభగలు తట్టుకోలేక ఉత్తర ప్రదేశ్లో 54 మంది, బిహార్లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో చాలా మంది ఆసుపత్రులకు వెళ్లవలసి వస్తోంది. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారిలో అత్యధికులు 60 సంవత్సరాల వయసు పైబడినవారే.
మరో నాలుగు రోజులు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా స్పష్టం చేశారు. 21వ తేదీ నాటికి వాతావరణంలో మార్పులు వస్తాయని ఆమె వివరించారు. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఎండ తీవ్రతకు రాష్ట్రం శుక్రవారం నిప్పుల కొలిమిలా మారింది. జంఘమహేశ్వరపురంలో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా అనేకచోట్ల 40 డిగ్రీలు దాటింది. కాగా రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.
అందుబాటులో ఉన్నవాటితోనే చల్లదనాన్ని అనుభవించడానికి బోలెడు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు. టేబుల్ ఫ్యాన్ తో కూలర్ చేసినవారు, మట్టి కుండలతో అతిచల్లగాలి క్రియేట్ చేసిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి
ఖమ్మం: జిల్లాలో భానుడు ఉగ్రతాండవం చేస్తున్నాడు. వేసవి తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేడి గాలులకు జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.