Weather Update: విజయవాడలో ఇవాళ వర్షం కురుస్తుందో.. లేదో.. చెప్పేసిన వాతావరణ శాఖ..!

ABN , First Publish Date - 2023-06-21T11:34:32+05:30 IST

బుధవారం ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా విజయవాడలో 66.5 మిల్లీమీటర్లు, ఎ.కొండూరులో 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Weather Update: విజయవాడలో ఇవాళ వర్షం కురుస్తుందో.. లేదో.. చెప్పేసిన వాతావరణ శాఖ..!

విజయవాడ (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లూ వేడెక్కిన భూమి చల్లబడింది. ఉక్కబోత నుంచి ఉపశమనం లభించింది. వేడిగాలులు పక్కకుపోయి చల్లగాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు పలకరించాయి. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేడి వాతావరణం ఉంది.

VIJAYAWADA-BENZCIRCLE--(19).jpg

మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మొదలైన చిరుజల్లులు నెమ్మది హోరు వానగా మారాయి. మూడు గంటల పాటు భారీగా వర్షం కురిసింది. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ, మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లో వర్షం కురిసింది.

Rains.jpg

కంచికచర్ల, తిరువూరు, నందిగామ, వత్సవాయి మండలాల్లో చిరుజల్లులు మాత్రమే పడ్డాయి. జగ్గయ్యపేట ప్రాంతంలో వాన చినుకులు పడలేదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు వీచాయి. విజయవాడ నగరాన్ని వర్షం ముంచెత్తింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. నగరంలోని కబేళా, వన్‌టౌన్‌, వాగుసెంటర్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, భవానీపురం, విద్యాధరపురం ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. మైలవరం, రెడ్డిగూడెం ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. కొన్నిచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వర్షం, ఈదురు గాలుల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

DSC_7807.jpg

ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామంలో పిడుగుపడి తుళ్లూరు రామారావు అనే వ్యక్తి మరణించాడు. బుధవారం ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా విజయవాడలో 66.5 మిల్లీమీటర్లు, ఎ.కొండూరులో 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Updated Date - 2023-06-21T11:42:10+05:30 IST