Home » Sunday
లోకం చుట్టిరావాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ సగటు మనిషి జీవితకాలంలో ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో రెండు మూడు దేశాలకు వెళ్లడమే మహాగొప్ప. అభిరుచి, ఆసక్తి ఉన్నవారైతే పదో, ఇరవయ్యో దేశాలు చుట్టి మురిసిపోతారు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు కూడా మహా అయితే పాతికో, యాభై దేశాలో పర్యటిస్తారు.
ఏ కూల్‌డ్రింక్స్ షాపులోనైనా, కిరాణ దుకాణంలోనైనా ఫ్రిజ్ నిండా రకరకాల కూల్‌డ్రింక్స్ కనిపిస్తాయి. వేసవిలో అయితే గిరాకీ మొత్తం వీటిదే. సాఫ్ట్వేర్ రంగంలో సంక్షోభం అనుకోండి... మారుతున్న యువతరం అభిరుచి అనుకోండి... ఇటీవల ట్రెండ్ మారుతోంది. ఫ్రిజ్‌ల్లో సరికొత్తగా ‘ఐస్ కప్స్’ వచ్చి చేరుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు వెళ్లిన ఎవరైనా గంధర్వ మహల్ చూడకుండా వెనక్కి రాలేరు. నాలుగు అంతస్థులు, పాతిక గదులతో రాజసం ఉట్టిపడే ఆ భవనం నిర్మించి ఈ ఏడాదితో వందేళ్లు అవుతోంది. ఇప్పటికీ చెక్కు చెదరని చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన గంధర్వమహల్.. ఓ అద్భుత సౌందర్య సౌధం...
వరుసగా మూడు సినిమాల సక్సెస్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్(Shah Rukh Khan) పన్ను చెల్లింపులో టాప్‌లో నిలిచి వార్తల్లోకి ఎక్కాడు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి షారుక్ ఏకంగా రూ. 92 కోట్ల పన్ను కట్టి నెంబర్‌వన్ టాక్స్ పేయర్‌గా నిలిచినట్లు ఫార్చ్యూన్ ఇండియా తెలిపింది.
ఆమె పాట పాడితే కోట్లలో వ్యూస్... లక్షల్లో రీల్స్. ఏ భాషలో అయినా, ఏ పాట అయినా క్షణాల్లో వైరలవ్వాల్సిందే. బాలీవుడ్ ‘జవాన్’లోని ‘చలేయా’, ‘జైలర్’లో ‘వా.. నువ్వు కావాలయ్యా’ (తమిళ్ వెర్షన్), ‘గుంటూరు కారం’లో ‘ఓ మై బేబీ’ పాటలు చాలు... ఆమె టాలెంట్‌ను అంచనా వేయడానికి.
కుబేరులు తమ చేతిలో ఉండే వస్తువు ఏదైనా ఖరీదైనదై ఉండాలని కోరుకుంటారు. కొందరు అపర కోటీశ్వరులు లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా అలాంటి వస్తువులు తయారు చేయించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొందరు మిలియనీర్ల కోసం కొన్ని కంపెనీలు తయారుచేసిన లైటర్ల విశేషాలివి ...
గుర్రాలెక్కి సరదాగా షికారుకి వెళతారు. కానీ బెల్జియంలోని వూస్తడ్యన్‌కెర్కెలో మాత్రం సముద్రంలో రొయ్యల వేటకి వెళతారు. అదేంటీ... చేపలు, రొయ్యల వేటకు పడవల్లో కదా వెళ్లాల్సింది అంటారా? అదో సంప్రదాయం అంతే. 500 ఏళ్ల క్రితం మొదలైన ఈ వేట నేటికీ కొనసాగడం విశేషం.
మహ్మద్ సలీం... మామూలోడు కాదు. నిన్నమొన్నటి దాకా ఒక సాధారణ ఉద్యోగి. కానీ ఆయన చేసిన పని మాత్రం అసామాన్యమైనది. శవాన్ని చూస్తేనే మనం ఆమడ దూరం పారిపోతాం... అలాంటిది హైదరాబాద్‌లోని ప్రసిద్ధ గాంధీ ఆసుపత్రిలో 27 ఏళ్లపాటు ‘ఫోరెన్సిక్ విభాగం (పోస్ట్‌మార్టమ్)లో పనిచేసిన ఆయన తన సర్వీసులో ఎన్ని శవాలకు పంచనామా చేశారో తెలుసా? 60 వేలు ... ఈ మధ్యనే టెక్నీషియన్’గా ఉద్యోగ విరమణ చేసిన సలీం అనుభవాలు ఆయన మాటల్లోనే ...
చింతకాయలూ, చింతపండు, రెండింటినీ ఆహారంలోనూ, కొన్ని రకాల చికిత్సలలోను, కొన్ని రకాల వస్తువులను శుభ్రం చేేసందుకు కూడా వాడతాం. భారత ఉపఖండంలోనే కాక ఆసియాలోని వేరే దేశాల్లోనూ, మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాల్లో, మెక్సికో, కరీబియన్ ప్రాంతాల్లో కూడా వీటిని వాడతారు.
ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఈ యువతి కూడా ఒక కీలకపాత్ర పోషించింది. అతిపెద్ద క్రీడా పండగను... అంతే అద్భుతంగా మన కళ్ల ముందుం చిన ఫొటో జర్నలిస్టుల్లో అసోమ్‌కు చెందిన గీతికా తాలుక్దార్ ఒకరు.