Home » Suryapet
మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో నూతనంగా ఓ యూనిట్‌ను నిర్మిస్తున్నారు. ఈ నూతన యూనిట్ - 4 వద్దే ప్రమాదం చోటు చేసుకుంది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా హఠాత్తుగా లిఫ్ట్ కూలి కిందపడింది. దీనికింద కాంట్రాక్ట్ కార్మికులు కొందరు చిక్కుకుపోయారు.
తెలంగాణలో అతిపెద్ద జనాభా ఉన్న మాదిగలను అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు న్యాయం జరగడం లేదని మందుల సామేల్ రాజీనామా చేయడం హర్షించదగ్గ విషయం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ మాదిగలను వంచిస్తున్నారు.
సూర్యాపేట: ఐటీ దాడులపై మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై జరిగే ఐటీ దాడులు బీజేపీ ప్రేరేపిత దాడులేనని విమర్శించారు. విచారణ సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లాకేంద్రంలో సూర్యాపేట రూరల్ సీఐ సోమనారాయణసింగ్ డీజే టిల్లుగా మారారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యార్థులతో కలిసి నృత్యంచేశారు. తన హోదాను మరిచి ఆనందంతో కేరింతలు కొట్టారు. డీజే టిల్లు పాటకు డ్యాన్స్ వేసి తనకు ఉన్న కళాభిరుచిని చాటుకున్నారు. ఒక పోలీస్ అధికారి విద్యార్థులతో కలిసి నృత్యం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాటి, నేటి అభివృద్ధి పరిస్థితులను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...ఆకలి పారద్రోలి దేశానికి అన్నం పెట్టే స్థితిలో నేడు నిలిచామన్నారు.
రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు.
ప్రస్తుతం చాలా మంది యువత దురలవాట్లకు బానిసలై జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా వారి అలవాట్లను కొనసాగిస్తుంటారు. మరికొందరు డబ్బుల కోసం ఏకంగా తల్లిదండ్రులపై దాడులకు కూడా దిగుతున్నారు. ఇక..
ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి మెడలోని పుస్తెల తాడును ఇచ్చి ఓ దంపతులు మోసపోయారు.
దురాజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర కన్నులపండువగా సాగుతోంది.
తెలంగాణలోనే రెండో అతిపెద్ద దురాజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర వైభవంగా జరుగుతోంది.