Mom punishes Son: ఈ కోదాడ మహిళ గుర్తుందా..? ఏడాది క్రితం చేసిన పనితో మళ్లీ నెట్టింట వైరల్.. కన్నకొడుకునే కట్టేసి..
ABN , First Publish Date - 2023-03-10T21:19:44+05:30 IST
ప్రస్తుతం చాలా మంది యువత దురలవాట్లకు బానిసలై జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా వారి అలవాట్లను కొనసాగిస్తుంటారు. మరికొందరు డబ్బుల కోసం ఏకంగా తల్లిదండ్రులపై దాడులకు కూడా దిగుతున్నారు. ఇక..
ప్రస్తుతం చాలా మంది యువత దురలవాట్లకు బానిసలై జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా వారి అలవాట్లను కొనసాగిస్తుంటారు. మరికొందరు డబ్బుల కోసం ఏకంగా తల్లిదండ్రులపై దాడులకు కూడా దిగుతున్నారు. ఇక డబ్బున్న వాళ్ల పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పబ్స్, డ్రగ్స్‌కు అలవాటు పడి పోలీసులకు దొరికిపోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో అందరికీ కనువిప్పు కలిగించే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఏడాది క్రితం తెలంగాణ సూర్యాపేట జిల్లా (Telangana Suryapet District) కోదాడలో ఓ మహిళన తన కొడుకును చెట్టుకు కట్టేసి కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఏడాది క్రితం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ (Viral videos) అవుతోంది. కోదాడలోని గాంధీనగరానికి చెందిన రమణ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరి కుమారుడైన 15ఏళ్ల సురేష్.. దురవాట్లకు బానిస అయ్యాడు. కొన్ని నెలలుగా అతను గంజాయికి (Cannabis) అలవాటు పడ్డాడు. ఈ విషయం కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులకు తెలిసి గట్టిగా మందలించారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. మళ్లీ గంజాయి తీసుకుంటున్నాడని అతడి తల్లికి తెలిసింది. దీంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. కొడుకు అని తెలిసినా, దారిలో పెట్టేందుకు మనుసును కఠినం చేసుకుంది.
Viral Video: ఎవరూ లేని సమయం చూసి.. బైకుపై కూర్చున్న బాలిక.. అపవిత్రమైందంటూ చివరకు యజమాని చేసిన పని..
కరెంట్ స్తంభానికి కట్టేసి, కళ్లల్లో కారం కొట్టింది. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేస్తావా.. అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కళ్లల్లో కారం పడగానే ‘‘వద్దమ్మా.. ఇంకోసారి అలాంటి తప్పు చేయను’’.. అని బాలుడు గట్టిగా అరుస్తాడు. ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. రోజురోజుకూ యువత డ్రగ్స్‌కు (Drugs) అలవాటు పడుతున్న తరుణంలో ఈ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. దురలవాట్లకు (bad habits) బానిలసైన పిల్లలకు ప్రతి ఒక్కరూ ఇలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలంటూ కొందరు, కన్నతల్లికే విసుగు తెప్పించాడంటే.. ఈ పిల్లోడు ఏ పరిస్థితిలో ఉన్నాడో అర్థమవుతోంది.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.