Home » Tadepalli Jagan House
తాడేపల్లి ప్యాలెస్ నిర్మాణంలో ఉన్నప్పటి చిత్రమిది! బకింగ్ హామ్ కెనాల్, దాని కట్టపైన రోడ్డు,
ఈనెల 19న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అధ్యక్షతన ఈనెల 19న ఉదయం 10:30గంటలకు తాడేపల్లి(Tadepalli) క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బలగమెంత..? మాజీ సీఎంతో ఎంత మంది ఉన్నారు..? ఎన్నికల ముందు.. ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది..? ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? వైసీపీ (YSR Congress) మళ్లీ పుంజుకునేది ఎప్పుడు..? అసలు అది అయ్యే పనేనా..? ఇలా ఒకటా రెండా వందల సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి..
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంపు ఆఫీసుగా మార్చేసుకొని సకల రాజభోగాలు అనుభవించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల ఆడంబరాలు, వసతులు కల్పించుకున్నారు. సచివాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచే వ్యవహారం నడిపించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పుపట్టరు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఓటమితో వైఎస్సార్సీపీ (YSRCP) కకావికలం అవుతోంది. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమి ఘనవిజయం.. ఆ పార్టీ కేవలం11 సీట్లకే పరిమితం అవడంతో వైసీపీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయారు.
అధికారం ఉన్నంత సేపు ఒకరకం.. అధికారం పోతుందంటే మరొక రకంలా తయారైంది ఏపీ సీఎం వైఎస్.జగన్ పరిస్థితి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా వాస్తుని, ముహుర్తాలను నమ్ముతూ ఉంటారు. కానీ జగన్ గత ఐదేళ్ళలో తనకు నచ్చిందే చేసుకుంటూ వెళ్లారు. వాస్తును అసలు పట్టించుకోలేదు. అది అతని వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. అయితే ఐదేళ్ల తర్వాత జగన్‌లో అధికారం కోల్పోతున్నామనే భయం మొదలైందట.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిస్తే ఇప్పుడిస్తున్న అమ్మ ఒడి సాయాన్ని పెంచుతామని సీఎం జగన్(CM Jagan) ప్రకటించారు. తాడేపల్లిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ మాట్లాడారు. వైసీపీ గెలవగానే జగనన్న అమ్మఒడి కింద ఇస్తు్న్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచుతామని ప్రకటించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలపై సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ‘సిద్ధం’ సభలతో మొదటి విడత ప్రచారం పూర్తి చేశారు. ఈ ప్రచారంలో పలువురు వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ - జనసేన - బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుండటంతో జగన్‌లో ఓకింత భయం మొదలైంది. ఈ కూటమిని ఎలా ఢీకొట్టాలనే విషయంపై ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో పలు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీల మార్పులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఇంచార్జీల మార్పులతో ఐదో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
YS Sharmila Mets CM YS Jagan Reddy : ఏపీ సీఎం, సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకకు రావాలని జగన్‌కు శుభలేఖ అందజేశారు. కుమారుడు, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన షర్మిల.. అరగంట పాటు భేటీ అయ్యారు. జగన్, వదిన భారతీలకు పెళ్లి కార్డు ఇచ్చిన షర్మిల తప్పకుండా రావాలని ఆహ్వానించారు..