Home » Tadipatri
Andhrapradesh: ‘‘వైసీపీపై ఐదు సంవత్సరాలు పోరాడిన వ్యక్తిని నేను.. నాపై దొంగతనం కేసులు బనాయించారు.. డీటీసీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రాసిన లేఖను తప్పుపట్టారు. పంజాబ్‌లో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో నాతో పాటు రవీంద్రరెడ్డిపై
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపు రెండునెలల తర్వాత తాడిపత్రికి వెళ్లారు. అక్కడి పోలీ్‌సస్టేషనలో శనివారం జామీను పత్రాలను సమర్పించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు, రాళ్లదాడుల నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆయన అనంతపురంలో ఉంటున్నారు. ఈ నెల 15న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. దీంతో జామీను పత్రాలను పోలీసులకు అందించారు. రెండు రోజుల క్రితం మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం ఉత్కంఠ రేపింది. శాంతిభద్రతల సమస్య ...
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకోవడంతో శనివారం తెల్లవారుజామున నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉదయం పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. టీడీపీ నేత సూర్యమునిపై దాడి, పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ష్యూరిటీలు సమర్పించేందుకు...
రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మొదటి వరుసలో ఉండే తాడిపత్రికి పోలీసు సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ ప్రాంతంలో చిన్న సమస్య తలెత్తినా చినికి చినికి గాలివానగా మారుతుంది. ఎన్నికల సమయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. రెండు నెలల క్రితం జరిగిన దాడులు, ప్రతిదాడులు ఈ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య ఏ స్థాయిలో ఉందో ..
రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం చంద్రబాబునాయుడు వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపారని టీడీపీ క్లస్టర్ కన్వీనర్ ఉడేగోళం మారుతి అన్నారు. ఆదివారం స్థానిక ఆంజనేయస్వామి కట్ట వద్ద పింఛనదారులతో సమావేశమయ్యారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన పథకం కింద జూలై 1 పింఛన సొమ్ము ఇంటివద్దకే లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామమోహన తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద అద్భుత నృత్య ప్రదర్శనతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు తాడిపత్రి బాలికలు. మే 13, 15 తేదీల్లో మైనస్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో దాదాపు గంటన్నరపాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. తాడిపత్రికి చెందిన వందన డ్యాన్స అకాడమి విద్యార్థినులు సాయిమైత్రి, జోషిత, వర్ధిని, నవ్యశ్రీ, సాహిత్య, ...
జిల్లాలోని 27 మండలాల్లో బుధవారం రాత్రి వర్షం కురిసింది. యల్లనూరు మండలంలో అత్యధికంగా 89.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. తాడిపత్రిలో 75.0, యాడికి, రాప్తాడు 32.4, పుట్లూరు 31.4, కూడేరు 30.0, కళ్యాణదుర్గం 29.2, పెద్దవడుగూరు 23.2, అనంతపురం 22.0, ఉరవకొండ 21.6, పెద్దపప్పూరు 21.4, కణేకల్లులో 20.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన ...
ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పట్టణంలో ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ...
గౌతమి శాలి.. ఇప్పుడీ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది..! ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) పోలింగ్ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా తాడిపత్రిలో పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్పీని మార్చేసిన ఎన్నికల కమిషన్.. జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని (IPS Gowthami Sali ) నియమించడం జరిగింది. మేడమ్ అనంతలో అడుగుపెట్టగానే సీన్ మొత్తం మారిపోతోంది.!