JC Prabhakar Reddy: తప్పు చేస్తే వదిలిపెట్టం.. జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్
ABN , Publish Date - Mar 28 , 2025 | 07:50 PM
JC Prabhakar Reddy: తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం చోటుచేసుకునే ఉంటుంది. వైసీపీ హయాంలో తనను అన్యాయంగా జైలుకు పంపించారని జైసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.

అనంతపురం: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ(శుక్రవారం) జేసీ శివనారాయణ శర్మను అనంతపురం కలెక్టరేట్‌లో కలిశారు. తాము తప్పు చేయకపోయినా వైసీపీ ప్రభుత్వంలో జైలుకు పంపారని అన్నారు. వైసీపీ నేతల తప్పులను లీగల్‌గా చూపించి జైలుకు పంపుతున్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నాలుగు సెంట్లు మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారని ఆరోపించారు. ఆ ఇల్లు కూల్చవదంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. పాపం మాజీ మంత్రి విడుదల రజినీ ఎందుకు అంత బాధపడుతోందని అన్నారు. తప్పు చేస్తే జైలుకు వెళ్లి రావమ్మా.. ఏం ఫర్వాలేదని అన్నారు. తాము కూడా గతంలో జైలుకు వెళ్లి వచ్చామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
కాగా.. తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం చోటుచేసుకునే ఉంటుంది. వైసీపీ హయాంలో తనను అన్యాయంగా జైలుకు పంపించారని జైసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని జైసీ ప్రభాకర్ రెడ్డి పట్టుబడుతున్నారు. పెద్దిరెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జైసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. గతంలో చాలాసార్లు జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాసంఘటనలు ఉన్నాయి. తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు నేతల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Lokesh Congratulates Akhil: 11ఏళ్ల టెక్ పిడుగు అఖిల్‌కు మంత్రి లోకేష్ అభినందనలు
Vamsi Bail Petition: వరుస ఎదురుదెబ్బలతో వంశీ ఉక్కిరిబిక్కిరి
Read Latest AP News And Telugu News