TDP vs YCP: తాడిపత్రిలో ఉద్రిక్తత
ABN , Publish Date - Mar 22 , 2025 | 09:27 PM
ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్ణణ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇంటి వద్ద ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్ణణ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇంటి వద్ద ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫయాజ్ బాషా ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఫయాజ్ బాషా 13 సెంట్లలో నిర్మించుకున్న ఇంటిలో 5 సెంట్లకు మాత్రమే అనుమతి ఉందని పలుమార్లు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించకపోవడంతో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఫయాజ్ బాషా ఇంటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో గొడవకు దారి తీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.