Home » Tamilnadu News
తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురం కల్తీసారా మృతుల సంఖ్య శుక్రవారం 52కు పెరిగింది. మరో 112 మంది బాధితులు పుదుచ్చేరి, విల్లుపురం, కళ్లకుర్చి, సేలం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పర్యాటక ప్రాంతాలుగా ఉన్న జలాశయాల వద్ద అధికారులు సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జలాశయానికి వరద పోటెత్తడంతో 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
విరాళాల(Funds) సేకరణలో ఐఐటీ మద్రాస్ చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు విరాళాలుగా సమకూరినట్లు ఐఐటీ మద్రాస్(IIT Madras) సంచాలకుడు ప్రొఫెసర్ కామకోటి బుధవారం ప్రకటించారు.
దక్షిణ భారతదేశాన్ని కరవు పట్టి పీడిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు దక్షిణాది రాష్ట్రాల్లో తాండవిస్తున్నాయి. సీడబ్ల్యూసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చాలా రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటిపోయింది.
:తిరువళ్లూరు(tiruvallur) వైద్య వీరరాఘవ పెరుమాళ్ ఆలయ చిత్తిరై బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతియేటా తై, చిత్తిరై మాసాల్లో బ్రహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19వ తేదీ తొలి దశ పోలింగ్ జరగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. ఈ దశలో మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సర్వం సిద్దం చేస్తుంది.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ నిఘాను పటిష్టం చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి చెందిన హెలికాఫ్టర్‌ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. తమిళనాడు నీలగిరి జిల్లాలో రాహుల్ పర్యటన కోసం వచ్చిన హెలికాఫ్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. అధికార బీజేపీని ఢీ కొట్టడమే ధ్యేయంగా తమిళనాడులో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, జాతీయ పార్టీ ఏఐఎంఐఎం(AIMIM)లు పొత్తుకు సిద్ధమయ్యాయి.
Andhrapradesh: తమిళనాడులో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా కాసేపటి క్రితమే లోకేష్ కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. గురువారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో యువనేత కోయంబత్తూరు పయనమయ్యారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా ప్రచారం లోకేష్ ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే యువనేత అక్కడకు బయలుదేరి వెళ్లారు. తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం చేయనున్నారు.
తమిళనాడులో ఓ కారు బుధవారం ఉదయం బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురై జిల్లాలోని విరుదునగర్ - మధురై నాలుగు లేన్ల జాతీయ రహదారిపై శివరకోట్టై వద్ద ఈ ప్రమాదం జరిగింది.