Home » Tandur
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తిన్న ఆహారం వికటించి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
తరుచుగా ప్రభుత్వ వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బొండ్రు శోభారాణి ఆరోపించారు.
సాంకేతిక కారణాలతో తన ఖాతాలో పొరపాటున జమ అయిన రైతు రుణమాఫీ నిధులను తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయడం జరిగిందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం రాత్రి తెలిపారు.
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు నిందితులను తాండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా తాండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.45వేల విలువైన 500రూపాయల నకిలీ నోట్లు 90స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చంద్రయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు మల్లంపేట బాచుపల్లికి చేరుకున్నారు. అక్కడ మరో నిందితుడు జగదీశ్ నివాసంలో ఏకంగా రూ.7.50లక్షల విలువైన నకిలీ 500రూపాయల నోట్ల స్వాధీనం చేసుకున్నారు.
చోరీకి గురైన ఫోన్.. ఓ కుటుంబాన్ని తికమకపెట్టింది. ఓ వ్యక్తి రైలు కింద పడి చనిపోయాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఓటమి తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని... కాంగ్రె్‌సకు ఓటువేసి ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పిలుపునిచ్చారు. ఇప్పుడిప్పుడే దేశంలో మార్పు వస్తోందని, బీజేపీ ప్రభుత్వం వద్దని, మోదీ పాలనను అంతమొందించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు.
హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏనాడు చూడని విధంగా.. రక్తపాతం, కత్తులతో నరుక్కోవడం, మతాలు, కులాలుగా సమాజం విడిపోయేలా వైషమ్యాలను రెచ్చగొట్టేలా దుష్టశక్తులు పనిచేస్తున్నాయన్నారు.
జిల్లాలోని తాండూర్ ( Tandoor ) లో అదృశ్యమైన మహిళ హత్యగావించబడింది. ఒంటిపై ఉన్న ఆభరణాల కోసమే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్య చేసింది సైకో కిల్లర్ అని, 6 కేసుల్లో నిందితుడు, రౌడీ షీటర్ అని డీఎస్పీ శేఖర్ గౌడ్ ( DSP Shekhar Goud ) మీడియాకు తెలిపారు.
రాజ్‌భవన్ వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ (Governor Tamilsai, CMKCR) సమక్షంలో ఇవాళ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి పట్నంకు రెండు శాఖలను గులాబీ బాస్ కేటాయించారు..