Tandur: నిమ్స్‌కు ‘ఫుడ్ పాయిజన్’ విద్యార్థిని!
ABN , Publish Date - Dec 14 , 2024 | 04:38 AM
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తిన్న ఆహారం వికటించి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
తాండూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తిన్న ఆహారం వికటించి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు శుక్రవారం ఉదయం పంపినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. వాంతులతో గత మూడు రోజులుగా 9 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటన నేపథ్యంలో ముక్కిన, పురుగుల బియ్యాన్ని అధికారులు వెనక్కి తీసుకుంటున్నారు. పాఠశాలలో 150 క్వింటాళ్ల బియ్యాన్ని శుక్రవారం అధికారులు పౌరసరఫరా శాఖకు అప్పగించారు. ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థినులను శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు.