Share News

Bandru Shobha rani: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

ABN , Publish Date - Dec 12 , 2024 | 04:30 AM

తరుచుగా ప్రభుత్వ వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల వెనుక బీఆర్‌ఎస్‌ నాయకుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ బొండ్రు శోభారాణి ఆరోపించారు.

Bandru Shobha rani: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

  • ఇందులో బీఆర్‌ఎస్‌ పాత్ర.. ఎంఎ్‌సడీఎస్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి

తాండూరు/తాండూరు రూరల్‌, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): తరుచుగా ప్రభుత్వ వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల వెనుక బీఆర్‌ఎస్‌ నాయకుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ బొండ్రు శోభారాణి ఆరోపించారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా తాండూరులోని గిరిజన ఆశ్రమ సంక్షేమ వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కల్వ సుజాతతో కలిసి శోభారాణి పరామర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, వసతి గృహాల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై తమకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు ఉన్నాయని అన్నారు. అది చెబితే ఆయన నోటీసులు పంపించారని అలాంటి వాటికి తాము భయపడబోమని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Dec 12 , 2024 | 04:30 AM