Home » TATA IPL2023
ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే వంటి యువ భారత క్రికెటర్లు సంచలన ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు.
అటు బ్యాట్‌తో క్లాస్ ఆటకు, ఇటు మైదానంలో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌కు అజింక్యా రహానే పెట్టింది పేరు. కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రహానే ఈ ఐపీఎల్ ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
గతేడాది సూపర్‌ఫామ్‌తో అదరగొట్టిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ ఈ ఏడాది ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండా వికెట్ పారేసుకున్నాడు
దాదాపు మూడేళ్ల ఎదురు చూపుల తర్వాత క్రికెట్ దిగ్గజం సచిన్ వారసుడు అర్జున్ టెండూల్కర్‌కు ఐపీఎల్‌లో అవకాశం వచ్చింది. అర్జున్‌ను ముంబై టీమ్ కనీస ధరకు మూడేళ్ల క్రితం దక్కించుకుంది.
ఆదివారం సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచింది. ఫ్లాట్ వికెట్‌పై ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పరుగుల పండగ చేసుకున్నారు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
క్రికెట్‌లో అప్పుడప్పుడు ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ఒక క్యాచ్ పట్టడానికి ఇద్దరు వెళ్లి ఢీకొని క్యాచ్ నేల పాలు చేసిన ఘటనలు చాలా చూసి ఉంటాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అలాంటి ఘటనే జరిగింది.
మహేంద్ర సింగ్ ధోనీకి దేశవిదేశాల్లో అభిమానులు ఉన్నారు. వయసుతో తేడా లేకుండా అందరూ ధోనీలోని గొప్ప లక్షణాలను ఇష్టపడుతుంటారు.
ఎంత అనుభవం, నైపుణ్యం ఉన్నా బంతి బ్యాట్‌కు తగిలిందా? లేదా? అనే విషయంలో అంపైర్లు అయోమయానికి లోనవుతుంటారు. అయితే బంతి బ్యాట్‌కు తగిలినపుడు వికెట్ కీపర్లకు, బ్యాట్స్‌మెన్‌కు దగ్గర ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లకు తెలిసిపోతుంటుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో మాత్రమే కాదు ఫీల్డింగ్‌లో కూడా సత్తా చాటుతూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. నమ్మశక్యం కాని క్యాచ్‌లను అందుకుని మ్యాచ్‌లను మలుపు తిప్పుతున్నారు.