Home » Telangana Election2023
జనసేనతో పొత్తుతో బీజేపీ నేతల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. కొన్ని సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం ఉండటంతో బీజేపీ ఆశావాహులు ఆందోళన వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరోసారి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్వార్లతో హల్‌చల్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలో తల్వార్లతో కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఎర్రగడ్డ ఎన్నికల ప్రచారంలో తల్వార్లతో విన్యాసాలు చేశారు.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎన్నారైల నుండి బీఆర్ఎస్‌కు పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా నవంబర్ 30న జరగనున్న సాధారణ ఎన్నికల కోసం 50కి పైగా దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నారైలు పార్టీ తరఫున ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో బీఆర్‌ఎస్ షాక్ తగిలింది.
ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
జనసేన పొత్తు అంశం బీజేపీలో కలకలం రేపుతోందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారని సమాచారం.
హైదరాబాద్: కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో ఖైరతాబాద్‌కు మాత్రమే అభ్యర్థిని ప్రకటించారు. మిగిలిన ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక తల నొప్పిగా మారడంతో తర్జన భర్జన పడుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు, వైసీపీ సర్కారుపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో... ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని భావిస్తోంది..
కేసీఆర్ పార్టీలో బీసీగా వివక్ష చూసి చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు.
బీజేపీ టికెట్ విషయంలో గత రోజులుగా వస్తున్న వార్తలపై సీనీనటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తన మీద మీడియాలో, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు మోహన్‌కు టికెట్ వస్తుందో రాదో తరువాత విషయమని.. కొడుకుకు వస్తుంది, తండ్రి తండ్రికి రాదు అంటూ వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.