Etela Rajender: కేసీఆర్ పార్టీలో ఉండి చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నా.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-10-28T15:24:15+05:30 IST
కేసీఆర్ పార్టీలో బీసీగా వివక్ష చూసి చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్: కేసీఆర్ (CM KCR) పార్టీలో బీసీగా వివక్ష చూసి చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్ (BJP Leader Etela Rajender) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బడుగులకు అధికారం రాకుండా కేసీఆర్ర అడ్డుకున్నారని మండిపడ్డారు. మాటలు చెప్పి దళితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. గిరిజన, ఆదివాసీ బిడ్డలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారచు. అందరినీ మోసం చేసి ఆయన కుటుంబం తెలంగాణను పాలిస్తోందన్నారు. బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారని.. బీసీలు అంటే కేసీఆర్కు చిన్న చూపు, చులకనా అంటూ వ్యాఖ్యలు చేశారు. దేశానికి బీసీని ప్రధాని చేసింది బీజేపీ అని చెప్పుకొచ్చారు. దళిత, మైనారిటీ, గిరిజన బిడ్డలను దేశ రాష్ట్రపతిని చేసింది బీజేపీ మాత్రమే అని చెప్పుకొచ్చారుర. కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో అణగారిన వర్గాలను కాంగ్రెస్ చిన్న చూపు చూసిందని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ఎంత మందికి టికెట్కు ఇచ్చారో చూశామన్నారు. బీజేపీ మాత్రం బీసీలకు 40 టికెట్లను కేటాయించబోతోందని తెలిపారు. కాబట్టి బీజేపీకి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.