Home » Telangana Election2023
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు (బుధవారం) ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో టీపీసీసీ చీఫ్ పాల్గొని ప్రసంగించారు.
కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెను తుఫాన్‌లా విజృంభిస్తోందని మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకుని రావటం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ఎన్నికల్లో వైఎస్సార్టీపీ (YSRTP) పోటీ చేయట్లేదని.. కాంగ్రెస్ పార్టీకి (Congress) బేషరతుగా మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించిన సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో విలీనం అని ఢిల్లీ, బెంగళూరు వేదికగా పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ చివరికి ఎందుకు ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఒంటరిగా పోటీచేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది కానీ.. ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. సడన్‌గా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని షర్మిల నిర్ణయించారు...
ఎన్నికల ముందు మోదీకి బీసీలు గుర్తొచ్చారా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ నుంచి పటాన్‌చెరుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు అనుచరులు ఘన స్వాగతం పలికారు.
2018లో దత్తత పేరుతో నల్గొండ ప్రజలను మోసం చేశారని.. మళ్లీ దత్తత అని చెప్పే వాళ్ళని ఉరికించాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు.
సీఎం కేసీఆర్ నియంత పాలనపై తిరుగుబాటు చేసి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు మల్కాజిగిరిలో కోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో అజారుద్దీన్‌పై నమోదైన కేసులో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది...