VH: ఎన్నికల ముందు మోదీకి బీసీలు గుర్తొచ్చారా?
ABN , First Publish Date - 2023-11-07T16:11:43+05:30 IST
ఎన్నికల ముందు మోదీకి బీసీలు గుర్తొచ్చారా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఎన్నికల ముందు మోదీకి (PM Modi) బీసీలు గుర్తొచ్చారా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (Congress Leader V Hanumanth rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీల కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందన్నారు. ఐఐటీ, ఐఐఎమ్‌లో రిజర్వేషన్లు కావాలని కోర్టుకు వెళ్తే అవకాశం లేదని సుప్రీం కోర్టు (Supreme Court) చెప్పిందన్నారు. ఓబీసీ కుల గణన చేయడానికి రాహుల్ అంగీకరించారని... హామీ కూడా ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు మోడీకి బీసీల ఆత్మగౌరవం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా కావాలని అడిగిన పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఇప్పుడు మోడీ పక్కన చేరారన్నారు. పవన్ కళ్యాణ్‌ను బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని అన్నారు. బీసీల గురించి చెప్తున్న పవన్ కళ్యాణ్ కాపుకు చెందిన వారన్నారు. ప్రైవేట్ ఇండస్ట్రీలలో రిజర్వేషన్స్ ఎందుకు అడగలేదని నిలదీశారు. మోడీ ఓబీసీలకు చేస్తున్న మోసాన్ని గమనించాలని అన్నారు. కాంగ్రెస్ ఒక్కటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని వీహెచ్ చెప్పుకొచ్చారు.