Komatireddy Venkatreddy: మళ్లీ దత్తత అంటే ఉరికిద్దాం.. ఈసారి జండూభామ్ పని చేయదు
ABN , First Publish Date - 2023-11-07T15:46:55+05:30 IST
2018లో దత్తత పేరుతో నల్గొండ ప్రజలను మోసం చేశారని.. మళ్లీ దత్తత అని చెప్పే వాళ్ళని ఉరికించాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు.
నల్గొండ: 2018లో దత్తత పేరుతో నల్గొండ ప్రజలను మోసం చేశారని.. మళ్లీ దత్తత అని చెప్పే వాళ్ళని ఉరికించాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Congress Leader Komatireddy Venkatreddy) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... 30న పోలింగ్ ఉంది కాబట్టి 27 నుంచి మీ అకౌంట్లోకి రుణమాఫీ, రైతు బంధు డబ్బులు వస్తాయని... మోసపోవద్దని అన్నారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణాలో (Telangana State).. కేవలం 460 మంది అమరులని వారికే డబ్బులు, ఉద్యోగాలు ఇచ్చారన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న 1200 మందికి న్యాయం జరగలేదని అన్నారు. ఉద్యోగులకు నెలాఖరుకు జీతాలు, పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ డిసెంబర్ 3న రాజీనామా చేస్తారని.. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రమాణ స్వీకారం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఏ హోదాలో ఉన్నా నల్గొండనే శ్వాస.. నా ప్రాణం... మీరే నాకన్నీ.. వారంలో మూడు రోజులు ఇక్కడే ఉంటా. ఈసారి జండూభామ్ పని చేయదు’’ అని అన్నారు. నల్గొండలో నేను, మునుగోడులో రాజ్‌గోపాల్ రెడ్డి, నకిరేకల్‌లో వీరేశంలను 70 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి 80కి పైగా సీట్లు రాబోతున్నాయని.. ఐదేళ్లు ప్రశాంతంగా నల్గొండను అభివృద్ధి చేసుకుందామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.