Home » Telangana Politics
Telangana Politics: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్(BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్ను వీడగా.. ఇప్పుడు మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో కోనప్పపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పోటీ చేశారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం నాడు ‘రైతు నేస్తం’(Rythu Nestham) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమమే ‘రైతు నేస్తం’.
Telangana: కేసీఆర్ ప్రభుత్వానికి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్‌రావు కూడా ఉండడం డౌటే అని ... బీజేపీలోకి పోతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోందన్నారు.
BRS - BSP Alliance: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో(Telangana) కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్(BRS), బీఎస్పీ(BSP) మధ్య పొత్తు ఖరారైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతలు పొత్తు విషయమై జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరూ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయని కేసీఆర్ ప్రకటించారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముహుర్తం దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని నంది నగర్లో గల కేసీఆర్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం జీవో3 తో ఆడబిడ్డల నోట్లో మట్టి కొడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడతూ.. ఆ జీవోతో మహిళలు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్నారు. నిన్న ఇచ్చిన గురుకుల పోస్టుల్లో కేవలం 77 మాత్రమే వచ్చాయని.. 6వేల ఉద్యోగాల్లో మహిళలకు ఇచ్చింది కేవలం 70 మాత్రమే అని అన్నారు.
Telangana: జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం జిల్లాకు చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న పలువురి పేర్లను ఖరారు చేసినట్టుగా సమాచారం. కరీంనగర్ నుంచి బోయినపల్లి సంతోష్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పార్టీ నేతలతో నేడు (ఆదివారం) జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
Telangana: చలో మేడిగడ్డ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ బృందం మేడిగడ్డకు బయలుదేరింది. శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్‌ను బస్సుల్లో కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గులాబీ పార్టీ నేతలు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి బస్సుయాత్ర చేపట్టారు. మొత్తం 200 మంది బిఆర్ఎస్ నేతల బృందం కాళేశ్వరంకు బయలుదేరి వెళ్లింది.
Telangana: ‘‘చలో మేడిగడ్డ’’ బయలుదేరిన బీఆర్ఎస్ కాన్వాయ్‌లోని ఓ బస్సు టైర్ పగడంతో చిన్న అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్న బస్సు టైర్ పగిలింది అని చూశా. కారు టైర్లు అన్నీ మిగిలిపోయాయి. ఇక షెడ్డుకు పోవాల్సిందే’’ అంటూ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు.