BRS: మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం
ABN , Publish Date - Mar 01 , 2024 | 10:12 AM
Telangana: చలో మేడిగడ్డ పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్ బృందం మేడిగడ్డకు బయలుదేరింది. శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్‌ను బస్సుల్లో కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గులాబీ పార్టీ నేతలు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి బస్సుయాత్ర చేపట్టారు. మొత్తం 200 మంది బిఆర్ఎస్ నేతల బృందం కాళేశ్వరంకు బయలుదేరి వెళ్లింది.
హైదరాబాద్, మార్చి 1: ‘‘చలో మేడిగడ్డ’’ పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్ బృందం (BRS) మేడిగడ్డకు బయలుదేరింది. శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ (KTR), హరీష్‌రావు (Harish Rao), ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గులాబీ పార్టీ నేతలు బస్సుల్లో బయలుదేరారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి కాళేశ్వరానికి (Kaleshwaram Project) బస్సుయాత్ర చేపట్టారు. మొత్తం 200 మంది బీఆర్ఎస్ నేతల బృందం కాళేశ్వరంకు బయలుదేరి వెళ్లింది.
KTR: వాస్తవాలు చెప్పేందుకే ‘చలో మేడిగడ్డ’
మొదట నేరుగా మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. అనంతరం అక్కడ నుంచి అన్నారం సందర్శిస్తారు. అన్నారం వద్ద హరీష్‌రావు, కడియం శ్రీహరి, పొన్నాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం భూపాలపల్లిలో లంచ్ చేయనున్నారు. కాళేశ్వరంను ప్రభుత్వం విఫల ప్రాజెక్ట్‌గా చూపే కుట్రలు చేస్తోందని గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదని బీఆర్‌ఎస్ చెబుతోంది. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే చలో మేడిగడ్డ అని నేతలు తెలిపారు. కుంగిన బ్యారేజ్‌కు మరమత్తులు చేసి నీటిని ఎత్తిపోయాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
LPG Cylinder Price: బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..