Home » TG Politics
తెలంగాణ(Telangana) రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం(Rajiv Gandhi Statue) నిప్పు రాజేస్తోంది. తెలంగాణ సచివాలయానికి ఒక వైపు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఎదురుగా అమలవీరుల స్మారక స్థూపం గత బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసింది.
రైతు రుణమాఫీ గురించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఎక్కడికి వస్తారో రండి.. చర్చ పెడదామని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి అన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటని ప్రశ్నించారు. ఎనిమిది నెలల్లో రేవంత్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటో డేటా తీసుకువస్తామని సవాల్ విసిరారు.
రుణమాఫీపై త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసమని.. రైతు బంధు విషయంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు రైతు బంధు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన నానక్ రామ్‌గూడలోని హోటల్ షెరటాన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) సమావేశం ముగిసింది. సమావేశానికి పెద్దఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకాగా వారికి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ(Abhishek Manu Singhvi)ని రేవంత్ రెడ్డి పరిచయం చేశారు.
మరికాసేపట్లో నానక్ రామ్‌గూడలోని హోటల్ షెరటాన్‌లో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష(CLP) సమావేశం జరగనుంది. సమావేశంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి(Abhishek Singhvi) పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.
బ్రేక్ డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోండడంటూ తెలంగాణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు బుద్ధి చెప్పాల్సిందే అంటూ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్(Suresh Kumar Shetkar) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో రైతు రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) లేఖ రాశారు. రూ.40వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్తున్నారని, కానీ రూ.17వేల కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
టెక్నికల్ సమస్యలతో ఆగిన రుణమాఫీ(Rythu Runa Mafi) క్లియర్ చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) తెలిపారు. కొందరు రైతులకు లోన్ రూ.2.20లక్షలు, రూ.2.30లక్షలు ఉన్నాయని, రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ రైతు చెల్లిస్తే అటోమెటిక్‌గా రూ.2లక్షల రుణమాఫీ అవుతుందని జగ్గారెడ్డి వెల్లడించారు.
2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
జనగామ బీఆర్ఎస్లో వర్గపోరు మళ్లీ రాజుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మెుదలైన వేడి ఇంకా చల్లారలేదు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడి వేస్తే భగ్గమంటుంది. తాజాగా ఎమ్మెల్సీ పోచంపల్లి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పల్లా వర్గీయులు చింపేశారంటూ పోచంపల్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.