Jaggareddy: టెక్నికల్ సమస్యలతో ఆగిన రుణమాఫీ క్లియర్ చేస్తున్నాం..
ABN , Publish Date - Aug 17 , 2024 | 09:43 PM
టెక్నికల్ సమస్యలతో ఆగిన రుణమాఫీ(Rythu Runa Mafi) క్లియర్ చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) తెలిపారు. కొందరు రైతులకు లోన్ రూ.2.20లక్షలు, రూ.2.30లక్షలు ఉన్నాయని, రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ రైతు చెల్లిస్తే అటోమెటిక్‌గా రూ.2లక్షల రుణమాఫీ అవుతుందని జగ్గారెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: టెక్నికల్ సమస్యలతో ఆగిన రుణమాఫీ(Rythu Runa Mafi) క్లియర్ చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) తెలిపారు. కొందరు రైతులకు లోన్ రూ.2.20లక్షలు, రూ.2.30లక్షలు ఉన్నాయని, రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ రైతు చెల్లిస్తే అటోమెటిక్‌గా రూ.2లక్షల రుణమాఫీ అవుతుందని జగ్గారెడ్డి వెల్లడించారు. కొందరు ప్రతిపక్షాల నేతలు రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించారు. వారి తప్పుడు ప్రచారాలను నమ్మెుద్దని జగ్గారెడ్డి రైతులకు సూచించారు.
బీఆర్ఎస్ హయాంలో పదేళ్లపాటు రౌడీ పాలన జరిగిందని, సమస్యలు చెప్పడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు ధర్నా చేయకుండా పోలీసులతో లాఠీ దెబ్బలు కొట్టించారంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేటలో హరీశ్ రావు చేసిన దౌర్జన్యాలు అన్నీఇన్నీ కావని అన్నారు. సిద్దిపేట నంగునూరు పోలీస్ స్టేషన్ అటవీ ప్రాంతంలో ఉంటుందని, దాన్ని చూస్తేనే భయం వేస్తుందని అలాంటి చోటుకు కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకెళ్లి కొట్టారని మండిపడ్డారు.
ఆ సమయంలో కొందరు పోలీసులు అహంకారంతో పనిచేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఆసిఫాబాద్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న సీఐ సురేందర్ రెడ్డి.. అప్పట్లో హరీశ్ రావు కింద చెంచాగిరి చేశారని ధ్వజమెత్తారు. ఆయన చెప్పినట్టు చేసి తమ పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని చెప్పుకొచ్చారు. పోలీసులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేయాలంటూ జగ్గారెడ్డి హితవుపలికారు. పోలీసుల్లో కొందరు నిజాయితీగా పని చేస్తున్నారు కాబట్టే ప్రజలకు ఇంకా ఆ వ్యవస్థపై నమ్మకం ఉందని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Sridhar Babu: మేము ఎంటర్‌టైన్‌మెంట్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లలేదు..
Kaleshwaram Commission: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ వేగవంతం..
Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..
Crime News: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ..