Share News

Bandi Sanjay: రేవంత్ బీజేపీలోకి వస్తే.. కేసీఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్తారా..?: బండి సంజయ్

ABN , Publish Date - Aug 19 , 2024 | 12:05 PM

రుణమాఫీపై త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసమని.. రైతు బంధు విషయంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు రైతు బంధు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Bandi Sanjay: రేవంత్ బీజేపీలోకి వస్తే.. కేసీఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్తారా..?: బండి సంజయ్
Bandi Sanjay

కరీంనగర్: రుణమాఫీపై త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసమని.. రైతు బంధు విషయంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు రైతు బంధు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తే.. రైతులు రోడ్డు ఎందుకు ఎక్కుతున్నారని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీని అవమానించారని చెప్పారు. త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో రుణమాఫీపై ఆందోళనలు చేపడతామని.. రైతులకు అండగా నిలుస్తామని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వస్తే.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్తారా అని ప్రశ్నించారు.


వాళ్లకైనా ఏదో ఒక పార్టీ ఉందని.. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏ పార్టీలు లేవని విమర్శలు చేశారు. కేటీఆర్ బతుకు ఎటూ కాకుండా పోతుందని ఎద్దేవా చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉందని.. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధాంతాలు ఒక్కటేనని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 12:21 PM