Home » Thanneeru Harish Rao
Telangana: సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో తమ్ముడు మధుసూదన్‌రెడ్డి అరెస్ట్‌పై పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు. శుక్రవారం మాజీ మంత్రి హరీష్‌రావుతో కలిసి మహిపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్ముడి అరెస్ట్ పట్ల తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఎమ్మెల్యే కన్నీరుపెట్టుకున్నారు.
చత్రపతి శివాజీ స్ఫూర్తితో మాజీ సీఎం కేసీఆర్(KCR) 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అన్నారు. సోమవారం నాడు తూప్రాన్ మండలం వెంకటాయ పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిందేమో కొండంత చేస్తుందేమో గోరంత, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఆరోపించారు.
Telangana: పెద్ద ఎత్తున నేతలు బీఆర్ఎస్ను వీడటం ఆ పార్టీలో తీవ్ర కలవరాన్ని రేపుతోంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి జంప్ అవగా.. తాజాగా ఆరుగురు బీఆర్ఎస్ జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈ ఆరుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఈ ఆరుగురు కార్పొరేటర్లు కలిసినట్లు తెలుస్తోంది.
పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు( Harish Rao) అన్నారు. గురువారం నాడు నారాయణ్‌ఖేడ్ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడుతూ....అసెంబ్లీ ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ (Congress) ను ఓడించి గుణపాఠం చెప్పాలని అన్నారు.
Telangana: సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలన అని అన్నారు. రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలన్నారు.
Telangana: సీఎం రేవంత్ వంద రోజుల పాలన చూసి కాంగ్రెస్‌కు ఓటెయ్యండి అని అంటున్నారని.. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఏమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ‘‘కాషాయ పేపర్‌పై మోడీకి లవ్ లెటర్ రాసిండు. కాంగ్రెస్‌ను కూడా మోసం చేసిండు. రాహుల్ అధానిని తిడితే సీఎం రేవంత్ అలై బలై తీసుకున్నారు. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారు అన్నట్లుగా రేవంత్ మాట్లాడారు. రాహుల్ గాంధీయే ప్రధాని అవుతే మోదీ అవసరం ఏముంది నీకు. దేశంలో కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పిండు’’ అని అన్నారు.
Telangana: కేసీఆర్ ప్రభుత్వానికి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్‌రావు కూడా ఉండడం డౌటే అని ... బీజేపీలోకి పోతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోందన్నారు.
ఖమ్మం, మహబూబ్‌బాద్ పార్లమెంట్ నియోజక వర్గ నేతలతో బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) నేడు(సోమవారం) సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ఈ రెండు జిల్లాలోని కీలక నేతలంతా హాజరయ్యారు. కానీ కేసీఆర్ నిర్వహిస్తున్న మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkatarao) మాత్రం డుమ్మా కొట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే రాకపోవడం చర్చనీయాంశం అయింది.
కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా పాలమూరుకు వెళ్లారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలననైనా నిజాయితీగా చేయాలని హితవు పలికారు.
మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage)ను సందర్శించడానికి బీఆర్ఎస్(BRS) పార్టీ శుక్రవారం నాడు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్టు దగ్గరకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు.