Harish Rao: హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ విఫలం
ABN , Publish Date - Mar 11 , 2024 | 10:49 PM
చత్రపతి శివాజీ స్ఫూర్తితో మాజీ సీఎం కేసీఆర్(KCR) 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అన్నారు. సోమవారం నాడు తూప్రాన్ మండలం వెంకటాయ పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిందేమో కొండంత చేస్తుందేమో గోరంత, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఆరోపించారు.
మెదక్ జిల్లా: చత్రపతి శివాజీ స్ఫూర్తితో మాజీ సీఎం కేసీఆర్(KCR) 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అన్నారు. సోమవారం నాడు తూప్రాన్ మండలం వెంకటాయ పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిందేమో కొండంత చేస్తుందేమో గోరంత, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, చేసింది మాత్రం ఏదీ లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తమ గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి లాగా మాట్లాడడం లేదన్నారు.
సీఎం పదవిని దిగజారే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పారు. డిసెంబర్ 9వ తేదీన రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైంది ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు 13 హామీలు ఎక్కడ పోయాయని నిలదీశారు.అక్కచెల్లెళ్లకు ఇస్తానన్న రూ.2500 ఎక్కడపోయాయని అడిగారు. అవ్వ తాతలకు ఇచ్చే రూ. 4 వేల పెన్షన్ ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరో దించుతారని మాట్లాడుతున్నారని నిన్ను ఎవరు దించరని చెప్పారు. హామీలు నెరవేర్చక పోతే 5 ఏళ్ల తర్వాత జనమే తిరగపడతారని.. తెలంగాణ ప్రజలే ఈ ప్రభుత్వాన్ని దించుతారని హరీష్ రావు హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి