Harish Rao: వందరోజుల పాలనలో ఏమైంది?.. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి?
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:10 PM
Telangana: సీఎం రేవంత్ వంద రోజుల పాలన చూసి కాంగ్రెస్‌కు ఓటెయ్యండి అని అంటున్నారని.. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఏమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ‘‘కాషాయ పేపర్‌పై మోడీకి లవ్ లెటర్ రాసిండు. కాంగ్రెస్‌ను కూడా మోసం చేసిండు. రాహుల్ అధానిని తిడితే సీఎం రేవంత్ అలై బలై తీసుకున్నారు. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారు అన్నట్లుగా రేవంత్ మాట్లాడారు. రాహుల్ గాంధీయే ప్రధాని అవుతే మోదీ అవసరం ఏముంది నీకు. దేశంలో కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పిండు’’ అని అన్నారు.
హైదరాబాద్, మార్చి 6: సీఎం రేవంత్ (CM Revanth Reddy) వంద రోజుల పాలన చూసి కాంగ్రెస్‌కు (Congress) ఓటెయ్యండి అని అంటున్నారని.. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఏమైందని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister HarishRao) అన్నారు. ‘‘కాషాయ పేపర్‌పై మోడీకి లవ్ లెటర్ రాసిండు. కాంగ్రెస్‌ను కూడా మోసం చేసిండు. రాహుల్ అధానిని తిడితే సీఎం రేవంత్ అలై బలై తీసుకున్నారు. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారు అన్నట్లుగా రేవంత్ మాట్లాడారు. రాహుల్ గాంధీయే ప్రధాని అవుతే మోదీ అవసరం ఏముంది నీకు. దేశంలో కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పిండు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ నిరంకుశమైనదని చెబుతున్నారు. ఆ గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ అంటున్నారు. రాహుల్, సోనియా ఆశీర్వాదం కంటే మోదీ ఆశీర్వాదం కోసం ఎక్కువ ప్రయాస పడుతున్నారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Telangana: రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
వందరోజుల్లో చేస్తామన్న హామీలు అమలు చేస్తేనే ఓటు అడిగే హక్కు ఉంటుందన్నారు. 2లక్షల రుణమాఫీ, 15వేల రైతు భరోసా, 24గంటల ఉచిత కరెంట్ ఇవ్వకుండా మాట తప్పారన్నారు. వడ్లకు బోనస్ ఇస్తామన్నారని.. కానీ ఇవ్వలేదన్నారు. ఏవీ ఇవ్వకుండా కాంగ్రెస్ ఎలా ఓటు అడుగుతుందని ప్రశ్నించారు. ట్యాంకర్‌లు పెట్టి పొలాలకు నీళ్లు పట్టించే దుస్థితి వచ్చిందన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్న రేవంత్ పాలనకు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు, రైతులు, రైతు కూలీలు నిర్ణయం తీసుకోవాలన్నారు. 4వేల పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసిన పాలనకు గుణపాఠం చెప్పాలన్నారు. 4వేల పెన్షన్ ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన కాంగ్రెస్‌పై కేసు పెట్టాలని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫ్రీ గా చేస్తామని చెప్పి మాట తప్పినందుకు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. దళిత బంధు ఇవ్వనందుకు దళితులు నిర్ణయం తీసుకోవాలని హరీష్‌రావు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Breaking: ఆర్ఎస్‌పీ ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌లో మరో వికెట్ ఔట్..!
Breaking: నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..