Home » Thanneeru Harish Rao
కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర అంటూ సీఎం కేసీఆర్ ( CM KCR ) , బీఆర్ఎస్ నేతలు పేపర్ ప్రకటనలు చేస్తున్నారని గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రక్త చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదని నర్సారెడ్డి చెప్పారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 80 సీట్లు గెలవబోతుందని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) పేర్కొన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి రైతుల పట్ల కాంగ్రెస్ వ్యతిరేకత చూపుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Telangana Elections: బీఆర్ఎస్, మంత్రి హరీష్‌రావు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే రైతుబంధు ఆగిందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిచిపోవడంతో కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రైతుబంధు రైతుల హక్కన్నారు. హరీష్ రావు భాధ్యతారహిత ప్రకటన ఎందుకు చేయవలసి వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ ఆదేశాలనే హరీష్‌రావు అమలు చేస్తున్నారని ఆరోపించారు.
Telangana Elections: రఘునందన్ రావు గెలిచాక ఏం చేసాడో ప్రజలు చూస్తున్నారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తండ్రి, కొడుకు, అల్లుడు వరుస పట్టి దుబ్బాక వస్తున్నారని.. ఏం చేశారని నిలదీశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయిందని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మితే రిస్క్‌లో పడుతామని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) వ్యాఖ్యానించారు.
Telangana Elections: లీడర్లను కొనవచ్చు కానీ తమ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనలేరని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ... రాహుల్, ప్రియాంకలు కర్ణాటకలో అయిదు హామీలు చెప్పారని.. అక్కడి ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. వారు అధికారంలోకి వచ్చాక ఉన్న కరెంటు పోయిందన్నారు.
జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా.. హైదరాబాద్‌లో ఉండే ఎమ్మెల్యేనా అని జగ్గారెడ్డిపై మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ సిద్దిపేట అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డి ( Doodi Srikanth Reddy ) మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) కి సవాల్ విసిరారు.