Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి:హరీశ్‌రావు
ABN , Publish Date - Apr 30 , 2024 | 03:36 PM
కాంగ్రెస్ (Congress) పాలనలో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. 28మంది ఆటో కార్మికులు చనిపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిమాకుట్టినట్లు కూడా లేదన్నారు. కనీసం వారి కుటుంబాలను కూడా పరామర్శించలేదని చెప్పారు.
సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ (Congress) పాలనలో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. 28మంది ఆటో కార్మికులు చనిపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. కనీసం వారి కుటుంబాలను కూడా పరామర్శించలేదని చెప్పారు. కార్మికులకు ముందస్తుగా మేడే శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డికి మద్దతుగా ఆటోయూనియన్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు, వెంకట్ రాంరెడ్డి, బీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Loksabha polls 2024: కరెంట్ పోయిందంటూ అబద్దాలు చెబుతున్నారు.. కేసీఆర్‌పై తుమ్మల ఆగ్రహం
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయన్నారు. కార్మికుల హక్కులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాపాడకుండా ఆదానీ, అంబానీలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాండ్ పేపర్‌లపై కాంగ్రెస్ రాసి ఇచ్చిన హామీలు 100రోజుల్లో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలపై రేవంత్‌రెడ్డి ప్రామిసరీ నోట్లు రాశారని.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్లపై ఓట్లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Madhukar Reddy: కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు..
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు ఓటేస్తే.. హామీలను అమలు చేయకపోయిన ప్రశ్నించే అస్కారం ఉండదని అన్నారు. వెంకట్ రాంరెడ్డిని మెదక్ ఎంపీగా గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామని మాటిచ్చారు. బాండ్ పేపర్ బౌన్స్ అయినా కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో ఓటుతో శిక్ష వేయాలన్నారు. రేవంత్ అసమర్థతతో కరెంటు సరఫరాను కూడా సరిగా చేయలేక పోయారన్నారు. ఈ విషయంలో ఉద్యోగస్తులకు షోకాజ్ నోటీసులు, ట్రాన్సఫర్లు చేస్తూ, సస్పెండ్ చేస్తూ రేవంత్ ప్రభుత్వం వేధిస్తోందని ధ్వజమెత్తారు.
బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్నారని.. అతనికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటకు ఏ ముఖం పెట్టుకొని రేవంత్ వస్తున్నారని ప్రశ్నించారు. వెటర్నరీ కాలేజ్‌ని కొడంగల్‌కు తీసుకుపోయారని.. ఆ కాలేజ్‌ని సిద్దిపేటలోనే కొనసాగిస్తానని చెప్పాకే ఇక్కడ అడుగుపెట్టాలని హరీశ్‌రావు అన్నారు.
Loksabha polls 2024: కేసీఆర్.. స్థాయిని మరిచి అబద్దాలు మాట్లాడుతున్నారన్న భట్టి
Read Latest Telangana News And Telugu News