Home » Thummala Nageswara Rao
‘‘మాజీ మంత్రి కేటీఆర్.. ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖ చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అన్నట్లు ఉంది, గత పదేళ్లలో చేనేత రంగాన్ని అన్నిస్థాయిల్లో అస్తవ్యస్తంచేసి, సొంత లాభాలకు వాడుకుని ఇప్పుడు లేఖ పేరిట రాజకీయం చేయడం విడ్డూరం’’
రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో ఈరోజు(మంగళవారం) వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.
పామాయిల్ సాగు చేస్తున్న రైతులను ఆదుకోవాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో శనివారం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం తాండూరులో పప్పుధాన్యాల బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో బొగ్గు గనుల వేలంపై సెంటిమంటలు అంటుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని రెండు బొగ్గు నిక్షేపాల బ్లాక్లను దాదాపు రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వేలం వేయగా... తాజాగా మరో మూడో బ్లాక్(శ్రావణపల్లి)ని శుక్రవారం వేలం వేస్తున్నారు.
పాత్రికేయుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తమ్ముల నాగేశ్వరరావు తెలిపారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయ మహాసభలు గురువారం ఖమ్మంలో ఘనంగా ముగిశాయి.
ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు, కంపెనీలకు సంబంధించిన బకాయిలు రూ. 100.76 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ను తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు(గురువారం) పరిశీలించారు.
పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీలో పలుచోట్ల గందరగోళం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లోని ‘ముందుమాట’లో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం..
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు(టెస్కాబ్) చైర్మన్గా వరంగల్ జిల్లాకు చెందిన మార్నేని రవీందర్రావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వరంగల్ డీసీసీబీ చైర్మన్గా, టెస్కాబ్ డైరెక్టర్గా ఉన్నారు. వైస్ చైర్మన్గా హైదరాబాద్ డీసీసీబీ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య నియమితులయ్యారు.
రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.