Minister Tummala: పెద్దవాగు ఘటన బాధాకరం...
ABN , Publish Date - Jul 21 , 2024 | 02:03 PM
భద్రాద్రి కొత్తగూడెం: పెద్దవాగు ఘటన చాలా బాధాకరమని, ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిన సమాచారం తెలియగానే ఎంతో తల్లడిల్లిపోయానని, హెలి కాఫ్టర్ ఆలస్యం అయితే ఏమైనా ప్రాణ నష్టం వాటిల్లిందని ఎంతో మదన పడ్డానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: పెద్దవాగు (Pedda Vagu) ఘటన చాలా బాధాకరమని, ప్రాజెక్ట్ (Project) ఆనకట్ట (Dam) తెగిన సమాచారం తెలియగానే ఎంతో తల్లడిల్లిపోయానని, హెలి కాఫ్టర్ ఆలస్యం అయితే ఏమైనా ప్రాణ నష్టం వాటిల్లిందని ఎంతో మదన పడ్డానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswararao) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో ఇటీవల భారీ వర్షాలకు గండిపడ్డ పెద్దవాగు ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.,) పంపే హెలి కాఫ్టర్ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఏలూరు నుంచి రప్పించామని, జిల్లా కలెక్టర్, ఎస్పీలు అప్రమత్తంగా ఉండటంతో వరదలో చిక్కిన 38 మందిని రక్షించడం జరిగిందన్నారు. ప్రాజెక్ట్ ఆనకట్ట తెగడం వల్ల రైతులకు అపార నష్టం వాటిల్లిందని, పెద్దవాగు ప్రాజెక్ట్ వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు.
1989లో ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిందని, ఉమ్మడి రాష్ట్రం ప్రాజెక్టు అని, గత ప్రభుత్వాల కో ఆర్డినేషన్ లేదని, ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేతలో అధికారుల నిర్లక్ష్యం తేలిందని మంత్రి తుమ్మల అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పెద్దవాగు ప్రాజెక్ట్ రీ డిజైన్‌తో నిర్మాణం చేస్తామని, ప్రాజెక్టు నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని తెలిపారు. తాను మంత్రిగా ఉన్నానంటే ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వాదమని, రేవంత్ రెడ్డి పాలనలో తమది ప్రజా ప్రభుత్వమని.. అందరినీ ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
కాగా భద్రాద్రి జిల్లా, అశ్వారావుపేట మండలం, గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గురువారం రాత్రి భారీ గండి పడింది. దీంతో కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.1975లో ఈ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం నిర్మించింది. అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామ సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు తెలంగాణలో మిగిలిపోగా దీని కింద సాగయ్యే ఆయకట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది. దీంతో ఈ ప్రాజెక్టుకు ఇరు రాష్ట్రాలతో అనుబంధం ఏర్పడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగరానికి భారీ వర్ష సూచన..
భద్రకాళీ అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు
శ్రీగంధంలో అప్పన్న స్వామి భక్తులకు దర్శనం
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ
నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News