Home » Thummala Nageswara Rao
తాను ఏ పార్టీలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ( NTR ) సంక్షేమ రాజ్యం ఆశయం కోసం పనిచేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ నేతల ఆహ్వానం మేరకు సోమవారం నాడు తుమ్మల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి మంత్రి తుమ్మల వెళ్లారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం నాడు నల్గొండలో ప్రజా పాలన సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు.
6 గ్యారెంటీలను వందరోజుల్లోగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) పేర్కొన్నారు. సోమవారం నాడు ఖమ్మంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తుమ్మల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ... ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియాగాంధీ ఆశీస్సులతో సుపరిపాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
పంట ఉత్పత్తులను సకాలంలో రైతుల నుంచి సేకరించి రైతులకు అండగా నిలబడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Tummala Nageswara Rao ) అధికారులకు సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం: కమ్మ జాతి చరిత్ర గర్వ కారణమని, పౌరుషం దాతృత్వం కలిగిన కమ్మ జాతి దేశం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
భద్రాచలంలో రాముడు కొలువై ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం నాడు భద్రాద్రి రామాలయాన్ని భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ మర్యాదలతో ఈవో రమాదేవి స్వాగతం పలికారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కార్యకర్తలు నిప్పులా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) పేర్కొన్నారు. ఆదివారం నాడు జిల్లాలోని పాల్వంచ సుగుణ గార్డెన్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు.
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి జిల్లాకు విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలకు సొంత జిల్లాలో ఘనస్వాగతం లభించింది. గజమాలతో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఆహ్వానించారు. ముగ్గురు మంత్రులు అమరవీరులకు నివాలులు అర్పించారు. అనంతరం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సుని ప్రారంభించారు
తన అభిమాన నాయకులైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మట్టా రాగమయి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం
ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్.. ఏర్పాటు చేయబోతున్న