Share News

TS Politics: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగలనుందా?.. కాంగ్రెస్‌ సమావేశంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 02 , 2024 | 01:53 PM

Telangana: తెలంగాణలో అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్‌‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది సీనియర్ నేతలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. కొద్ది రోజుల క్రితం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తాజాగా కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. వీరి బాటలోనే భద్రాచలం ఎమ్మెల్యే కూడా నడవబోతున్నారా అంటే నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి.

TS Politics: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగలనుందా?.. కాంగ్రెస్‌ సమావేశంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే

మహబూబాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణలో (Telangana) అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్‌‌కు (BRS) షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది సీనియర్ నేతలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. కొద్ది రోజుల క్రితం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తాజాగా కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. వీరి బాటలోనే భద్రాచలం ఎమ్మెల్యే కూడా నడవబోతున్నారా అంటే నిజమని అనిపిస్తోంది. కాంగ్రెస్ సదస్సులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాల్గొనడం అందుకు సాక్ష్యంగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే ఆ పార్టీ సమావేశాల్లో పాల్గొనడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

APSRTC: ఉగాది కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు


కాంగ్రెస్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Bhadrachalam BRS MLA Tellam Venkatrao) పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ సన్నాహక సదస్సులో భద్రాచలం ఎమ్మెల్యే హాజరయ్యారు. ఇల్లందులో ఆఫీసులో మహబూబాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageshwar Rao) పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నా ఆ పార్టీ పార్లమెంట్ సన్నాహక మీటింగ్‌లో పాల్గొనడం చర్చకు దారి తీసింది. త్వరలో బీఆర్ఎస్‌ను వదిలి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారనే వార్త హల్‌ చేస్తోంది. గతంలోనే మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కలిసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి తెల్లం వెంకట్రావు వెళ్లనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి...

Meta: వాట్సప్ సంచలనం.. ఏకంగా 76 లక్షల అకౌంట్ల తొలగింపు.. ఎందుకంటే

BJP-AAP: బీజేపీలో చేరకుంటే నన్నూ అరెస్టు చేస్తారు.. కాక రేపుతున్న అతిశీ కామెంట్స్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 02 , 2024 | 02:17 PM