TG Politics: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Mar 14 , 2024 | 10:38 PM
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని పలు సర్వేలు చెబుతున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటువేయాలని చెప్పారు. ముఖ్యంగా మల్కాజ్‌గిరి సీటును తిరిగి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.
హైదరాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని పలు సర్వేలు చెబుతున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటువేయాలని చెప్పారు. ముఖ్యంగా మల్కాజ్‌గిరి సీటును తిరిగి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.గత కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల ట్రిపుల్ ఆర్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. గురువారం నాడు కూకట్‌పల్లి భగత్ సింగ్ నగర్‌లో సర్దార్ భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.... బానిస బతుకులు మనకు అక్కర్లేదంటూ ఉరి కొయ్యలని ముద్దాడి మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను భగత్ సింగ్ సాధించారని తెలిపారు. స్వాతంత్ర భారతం నేడు అగ్ర దేశాల సరసన నిలబడి అగ్రస్థాయికి చేరుకుంటుందని తెలిపారు.
భారత దేశానికి ఉన్న అపారమైన శక్తి, భారత దేశ యువత అని తెలిపారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత నిర్వేదంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నూతనోత్సాహంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. అధికారం చేపట్టిన తమ ప్రభుత్వానికి అవాంతరాలు, ఆటంకాలు, కష్టాలు, అప్పులు, బాధ్యతలు, అవసరాలు ఉన్నాయన్నారు. అన్నింటినీ అధిగమించి సక్రమంగా, సగర్వంగా ఇచ్చిన హామీలు, అభివృద్ధి చేస్తామన్నా విశ్వాసం తమకు ఉందని చెప్పారు. ఆనాడు రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన కారణంగానే ఇప్పుడు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని చెప్పారు. రేవంత్ సీఎం అయ్యి రాష్ట్రానికి సుపరిపాలన, ప్రజాపాలనకు అంకురార్పణ జరిగిందని అన్నారు. సీఎం అయిన వంద రోజుల్లోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసి హైదరాబాద్ నగర అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన అనుమతులు తీసుకొని వచ్చామని తెలిపారు. దేశంలో అన్ని నగరాలకు లిమిటేషన్స్ ఉన్నాయి కానీ హైదరాబాద్ నగరానికి ఎటువంటి లిమిటేషన్స్ లేవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి