Home » Tirumala Laddu Controversy
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు అన్నారు.
Andhrapradesh: నా హయాంలో ఏఆర్ కంపనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయి అన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దన్న ధోరణిలో మాట్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఒక మతానికే ప్రతినిధిగా పవన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ వేషం వేసుకుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చర్యల వల్ల ఇతర మతాలను ఆచరించే వారిలో అభద్రతా భావం ఏర్పడదా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారని షర్మిల విమర్శలు చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ(Tirumala Laddu controversy) ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సస్పెన్స్ శుక్రవారం వీడనుంది.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడ్డి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సస్పెన్స్ శుక్రవారం వీడనుంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. గురువారం తిరుపతి వారాహి సభ నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ముందుగా ప్రకటించడంతో వారాహి సభలో పాల్గొని ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ సభను నిర్వహించారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఉండాలని..
Andhrapradesh: ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదని టీటీడీ టెక్నికల్ టీమ్ నవంబర్ 8, 2023న తేల్చిందన్నారు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నెలకు ఉత్పత్తి చేసే నెయ్యి కేవలం రూ.16 టన్నులు మాత్రమేనని టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్ధారించిందని తెలిపారు.
Andhrapradesh: తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్టు ఉందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అడిగిందన్నారు.