Tirumala Laddu Issue: అడ్డంగా దొరికేసిన AR డెయిరీ.. కల్తీకి ఆధారాలు ఇవేనా..
ABN , Publish Date - Oct 04 , 2024 | 09:02 PM
తిరుమల లడ్డూ తయారీకి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిని వైష్ణవి డెయిరీ నుంచి కొనుగోలు చేసినట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారుల విచారణలో తేలింది. ఏఆర్ డెయిరీ రెండు డెయిరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లు ఆధారాలను సేకరించింది. ఈ డెయిరీల దగ్గర కొనుగోలు..
తిరుమల లడ్డూ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్తీ నెయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కమర్షియల్ ట్యాక్స్ అధికారుల రహస్య నివేదికతో ఏఆర్ డెయిరీ బాగోతం బయటపడినట్లైంది. తిరుమల లడ్డూ తయారీకి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిని వైష్ణవి డెయిరీ నుంచి కొనుగోలు చేసినట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారుల విచారణలో తేలింది. ఏఆర్ డెయిరీ రెండు డెయిరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లు ఆధారాలను సేకరించింది. ఈ డెయిరీల దగ్గర కొనుగోలు చేసిన ధర కంటే తిరుమలకు తక్కువ ధరకు సరఫరా చేయడంతో నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైంది. ఏఆర్ డెయిరీ వైష్ణవి డెయిరీ వద్ద నెయ్యి కొనుగోలు చేసినట్లు ట్యాంకర్ వే బిల్లులు, జీఎస్టీ రసీదులు, టోల్ గేట్‌ల నుంచి కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఆధారాలు సేకరించారు. బోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీ నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. బోలే బాబా, వైష్ణవి డెయిరీలకు డైరెక్టర్ ఒకరేనని అధికారుల ఎంక్వైరీలో బయటపడింది. ఈ రెండు డెయిరీలె ఏఆర్ డెయిరీకి కిలో నెయ్యిని రూ.355కు విక్రయించింది. అయితే టీటీడీ నుంచి ఏఆర్ డెయిరీ కిలో నెయ్యి రూ.318కు సరఫరా చేస్తామని టెండర్ దక్కించుకుంది. రూ.355కు కొనుగోలు చేసిన నెయ్యిని రూ.318కు విక్రయించడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. వీటికి రవాణా ఖర్చులు అదనం. ఏఆర్ డెయిరీ రూ.355కు కొనుగోలు చేసి రూ.318కు విక్రయిస్తే ఆ సంస్థ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. సాధారణంగా నష్టం వస్తే ఆ టెండర్‌ను సంస్థ వదిలేసుకుంటుంది. కానీ ఏఆర్ డెయిరీ తిరుమలకు తక్కువకే నెయ్యిని సరఫరా చేయడంతో కచ్చితంగా కల్తీ జరిగిందనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
AP Capital: ఏపీ రాజధానికి రైల్వే ట్రాక్‌పై ఏపీ ఎంపీల కీలక ప్రకటన
తక్కువ ధరకు ఎలా..
ఏఆర్ డెయిరీ తాను కొనుగోలు చేసిన ధరకంటే తక్కువ ధరకు తిరుమలకు నెయ్యిని ఎలా సరఫరా చేసిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశాన్ని డెయిరీ ప్రతినిధులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు నెయ్యిలో కల్తీ చేసి తక్కువ ధరకు తిరుమలకు సరఫరా చేసినట్లు కమర్షియల్ అధికారుల నివేదికతో తేలిపోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సాధారణంగా వ్యాపారం చేసే వ్యక్తులు, సంస్థలు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకు విక్రయించవు. కానీ ఏఆర్ డెయిరీ తక్కువ ధరకు సరఫరా చేయడంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
AP Highcourt: హైకోర్టులో సజ్జలకు ఊరట.. ఏ కేసులో అంటే
స్వతంత్ర సిట్ ఏర్పాటు..
మరోవైపు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. ఈ బృందంలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరోకరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుంచి ఉండనున్నారు.
Tirumala issue: తిరుమల లడ్డూ వివాదం- సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రుల రియాక్షన్ ఇదే..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
To Read More Latest Telugu News Click Here