Home » Tirumala Laddu Controversy
Andhrapradesh: టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డైరీపై టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 లక్షల కేజీలు నెయ్యి సప్లైకి ఏఆర్ డైరీకీ ఈ ఏడాది మే 15వ తేదీన ఆర్డర్స్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25వ తేదీతో పాటు జూలై 6వ తేదీన 4 ట్యాంకర్ల...
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. పూరీ జగన్నాథుడికి నైవధ్యంగా సమర్పించే పదార్థాల్లో వినియోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించింది.
లడ్డూ వ్యవహారంలో బుధవారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తిరుమల లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Telangana: తిరుమల లడ్డు వివాదం వెనక బీజేపీ కుట్ర ఉందంటూ జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డు కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాలు ఏమిటి, జరిగింది ఏంటి అన్న విషయాలు మాత్రమే చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయన్నారు.
నిర్మాణమే పూర్తి కాని అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమల లడ్డూ విషయంలో సినీ నటుడు కార్తీ సారీ చెబుతూ చేసిన ట్వీట్‌పై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కార్తీని అభినందిస్తూ మరో ట్వీట్ చేశారు. సంప్రదాయాల పట్ల కార్తీ చూపిన గౌరవాన్ని, వేగవంతమైన ప్రతిస్పందనకు అభినందనలు తెలిపారు. అంతేకాదు..
తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో ఈ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana: తిరుపతి లడ్డు కల్తీపై తాను కూడా సీబీఐ విచారణ కోరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డు కల్తీ జరిగిందని చెప్పారని.. తిరుపతి లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.
Prakash Raju vs Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజు స్పందించారు. తాను చేసిన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని.. ముందుగా తన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. అంతేకాదు.. ప్రస్తుతం తాను షూటింగ్లో భాగంగా విదేశాల్లో ఉన్నానని..