Home » TMC
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పోలింగ్ సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం, హత్యలు, బ్యాలట్ బాక్సుల లూటీ వంటి దారుణాలు జరిగిన నేపథ్యంలో ఈ ఎన్నికలు చెల్లనివని ప్రకటించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరింది.
ఎన్నికలు జరిగే రోజు ప్రజాస్వామ్యానికి అత్యంత పవిత్రమైన రోజు అని, రక్తపాతాన్ని ఆపాలని ప్రజలను, రాజకీయ పార్టీలను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోరారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన హింసాత్మక సంఘటనలు, బ్యాలట్ బాక్సుల లూటీలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి హింసాకాండ తీవ్రంగా ఉంది. శుక్రవారం నలుగురు టీఎంసీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. పోలింగ్ ప్రారంభమవడానికి ముందు తమపై దాడులు జరిగాయని కాంగ్రెస్, సీపీఎం ఆరోపిస్తున్నాయి.
పశ్చిమబెంగాల్లో సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా తమకు ఉందని, విపక్షాల ఐక్యతా కూటమి అవసరం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెగేసి చెప్పింది. బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికి వ్యతిరేకంగా విపక్షాల జాతీయ కూటమి ఏర్పాటుకు విపక్ష దిగ్గజనేతలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో టీఎంసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee)పై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల మనసులను దోచుకోవడానికే తన మోకాలికి గాయమైనట్లు ఆమె నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల కమిషన్ (ECI) మంగళవారం ప్రకటించింది. జూలై 24న పోలింగ్ జరుగుతుందని, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పశ్చిమబెంగాల్ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. తాను బటన్ నొక్కితే నలుగురు కాంగ్రెస్ ఎంపీలు టీఎంసీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
కోల్కతా: పశ్చిమబెంగాల్లో స్కూలు ఉద్యోగాల కుంభకోణం లో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సమన్లు పంపింది. శనివారం ఉదయం 11 గంటలకు తమ ముందు విచారణకు హాజరుకాలని ఆదేశించింది.
కోల్కతా: బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్సభ ఎన్నికల్లో 'ఐక్య విపక్ష కూటమి' ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట్ల టీఎంసీ మద్దతు ఇస్తుందని తెలిపారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) పాట పాడారు.