Congress Vs TMC : మమత మోకాలికి గాయం.. అంతా నాటకం అంటున్న కాంగ్రెస్..
ABN , First Publish Date - 2023-06-29T13:27:24+05:30 IST
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee)పై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల మనసులను దోచుకోవడానికే తన మోకాలికి గాయమైనట్లు ఆమె నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee)పై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల మనసులను దోచుకోవడానికే తన మోకాలికి గాయమైనట్లు ఆమె నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
జూలై 8న జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ విజయం కోసం మమత బెనర్జీ ప్రచారం చేస్తున్నారు. రెండు రోజులపాటు ప్రచారం చేసి, మంగళవారం తిరిగి కోల్‌కతాకు వస్తూండగా వాతావరణం అనుకూలించకపోవడంతో సిలిగురిలో హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించేశారు. ఆ సమయంలో ఆమె మోకాలికి, నడుముకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం తన నివాసంలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఇద్దరు సీనియర్ డాక్టర్లు ఆమెను తనిఖీ చేశారని, రెండు గంటలపాటు ఫిజియోథెరపీ చేశారని తెలిపారు. బుధవారం ఆమె ఆరోగ్యం మెరుగయిందని, మందుల వాడకం కొనసాగించాలని డాక్టర్లు చెప్పారని తెలిపారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ, సామాన్యులను తప్పుదోవ పట్టిస్తారనే ఖ్యాతి మమత బెనర్జీకి ఉందన్నారు. గతంలో కూడా ఎన్నికల ప్రచార సమయంలో ఆమె గాయపడినట్లు వార్తలు వచ్చాయన్నారు. ఎన్నికలు ముగిసిపోతే, ఆమె తన కాళ్లతో తాను నడవగలుగుతారని తాను అప్పట్లో చెప్పానని గుర్తు చేశారు. ప్రజల మనసులను దోచుకోవడానికే ఆమె ఇలాంటివాటిని సృష్టిస్తున్నారన్నారు.
ఇవి కూడా చదవండి :
Obama Vs Modi : బరాక్ ఒబామా ఓ ప్రైవేట్ వ్యక్తి : అమెరికా
Eid al-Adha : ఈద్ అల్-అదా పండుగ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు