Home » TMC
కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కార్ దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. అస్సాంలో టీఎంసీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో దీదీ పాల్గొన్నారు.
సందేశ్ఖాళిలో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ అండ్ కో చేసిన ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఏం జరిగిందనే అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పర్యటించి నివేదిక రూపొందించారు. ఆ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఓ యాత్రికురాలిని నడి రోడ్డుపై ఓ యువకుడు వేధించాడు. ఈ ఘటన తాలూకూ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ ఈ ఘటనపై స్పందించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి బహరాంపూర్లో నడిరోడ్డుపై తమ కార్యకర్తను నిలదీస్తూ వీరంగ సృష్టించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అధీర్ రంజన్ దౌర్జన్యాన్ని ఎండగడుతూ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.
పశ్చిమ బెంగాల్లో(West Bengal) శాంతి నెలకొంటే బీజేపీ(BJP) సహించదని సీఎం మమతా బెనర్జీ(CM Mamata Benerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరం బ్లాస్ట్ నిందితులను ఎన్ఐఏ కోల్కతాలో అదుపులోకి తీసుకున్న తరువాత బీజేపీ నేతలు బెంగాల్ సురక్షిత ప్రాంతం కాదని ఆరోపించారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బంపర్ ఆఫర్ ఇఛ్చారు. డైమండ్ హార్బర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని అమిత్ షాకు పిలుపు నిచ్చారు. పోని ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయకుంటే.. ఈడీ, సీబీఐ,ఎన్ఐఏ డైరెక్టర్లు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నారు.
బీజేపీ, ఎన్ఐఏ మధ్య అవగాహన ఉందని తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఎన్ఐఏ అధికారులతో బీజేపీ సభ్యుడు ఒకరు సమావేశమయ్యారని ఆరోపించారు.
ప్రధాని మోదీ(PM Modi) చెబుతున్న "మోదీ కా గ్యారంటీ" అంటే ప్రతిపక్ష నేతలను జైల్లో వేయడమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఘాటు విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె జలపాయిగురిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(TMC) అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ(BJP) నంబర్ 1 పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ నేత ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు.
పశ్చిమ బెంగాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై దాడుల ఘటన పొలిటికల్ హీట్ పెంచుతోంది. దోపిడీ, అవనీతి చేసే వారిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) ఫైర్ అయ్యారు.