West Bengal: ఇండియా కూటమి గెలిస్తే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ రద్దు.. దీదీ సంచలన ప్రకటన
ABN , Publish Date - Apr 17 , 2024 | 03:48 PM
కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కార్ దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. అస్సాంలో టీఎంసీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో దీదీ పాల్గొన్నారు.
అస్సాం: కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కార్ దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. అస్సాంలో టీఎంసీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో దీదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "ఏప్రిల్ 17 న ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే CAA, NRC రద్దు చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉండదు. ఎన్నికలు అసలే ఉండవు. వారు దేశం మొత్తాన్ని నిర్బంధ శిబిరంగా మార్చారు. నా జీవితంలో ఇంత ప్రమాదకరమైన ఎన్నికలను నేను ఎప్పుడూ చూడలేదు. మా పార్టీ అన్ని మతాలను ప్రేమిస్తుంది.
ప్రజలను మత ప్రాతిపదికన విభజించాలని కోరుకోదు. ఇండియా కూటమి గెలిస్తే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC), పౌరసత్వ సవరణ చట్టం (CAA), యూనిఫాం సివిల్ కోడ్ ఉండవు.
Delhi: ఆప్ కా రాం రాజ్య వెబ్‌సైట్‌ని ప్రారంభించిన ఆప్.. అసలేంటిది
అన్ని వివక్షపూరిత చట్టాలను రద్దు చేస్తాం. అసోం లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన టీఎంసీ అభ్యర్థులకు మద్దతునివ్వండి. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీ 126 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ఫైనల్ ఇంకా రావాల్సి ఉంది. నేను మళ్ళీ వస్తా" అని మమతా పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి