Elections 2024: మోదీ వర్సెస్ దీదీ.. బెంగాల్ లో మంట పుట్టిస్తున్న ఎన్నికల ప్రచారం..
ABN , Publish Date - Apr 08 , 2024 | 11:27 AM
పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై దాడుల ఘటన పొలిటికల్ హీట్ పెంచుతోంది. దోపిడీ, అవనీతి చేసే వారిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) ఫైర్ అయ్యారు.
పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై దాడుల ఘటన పొలిటికల్ హీట్ పెంచుతోంది. దోపిడీ, అవనీతి చేసే వారిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) ఫైర్ అయ్యారు. దీనిపై ఘాటుగా స్పందించిన టీఎంసీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న మోదీ భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును సమం చేయాలని భావిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల ద్వారా అవినీతి, హింసకు లైసెన్సు కావాలని కోరుతున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను దూరంగా ఉంచేందుకు సెంట్రల్ ఏజెన్సీలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు సీఎం మమతా బెనర్జీ.
America : బోయింగ్ కు తప్పిన పెను ప్రమాదం.. ఘటనపై క్షమాపణలు..
2022 భూపతినగర్ పేలుడు కేసు దర్యాప్తునకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందం విచారణకు వెళ్లిన సమయంలో వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఓ అధికారిని గాయపరిచారని ఆరోపించారు. తెల్లవారుజామున దర్యాప్తు సంస్థ అధికారులు గ్రామంలోకి ప్రవేశించడంతో ఆత్మ రక్షణ కోసం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారని మమతా చెప్పుకొచ్చారు.
Kerala Raging: హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం.. బట్టలు విప్పించి నగ్నంగా ఊరేగింపు..
కాగా.. బెంగాల్ లో జరిగే తొలి విడత ఎన్నికల కోసం భద్రతా బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. మొదటి విడతలో దేశ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండటం వల్ల తర్వాతి దశల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల నుంచి పోలీసు బలగాలను రాష్ట్రానికి రప్పించనున్నారు. తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి భద్రతా సిబ్బంది రానున్నారు. భూపతినగర్ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనుంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.